భారత్ ప్రస్తుతం న్యూజిలాండ్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. టి 20 ప్రపంచ కప్ ముగిసిన తక్కువ సమయంలోనే ఈ సిరీస్ మొదలైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండో టీ 20 మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఇండియా సునాయసంగా చేధించింది. విరాట్ కోహ్లీ ,హార్దిక్ పాండ్య , స్టార్ బౌలర్లు షమీ , బుమ్రా లేకున్నా కూడా ఇండియా టీం దంచికొడుతుంది.
అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి గ్రౌండ్ లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో మిడాన్ లో ఫీల్డింగ్ లో చేస్తున్న రోహిత్ వద్దకి వెళ్లిన ఆ అభిమాని అమాంతం పాదాలపై పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో భారత కెప్టెన్ రోహిత్ శర్మా కూడా ఆశ్చర్యపోయాడు. అయితే ఆటగాళ్ల భధ్రతపై పలువురు మాజీలు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా సార్లు అభిమానులు ఇలా మైదానంలో దూసుకొచ్చారు.
కరోనా నేపథ్యంలో క్రికెటర్లంతా బయోబబుల్ లో గడుపుతున్నారని, ఈ సమయంలో ఏదైనా జరిగితే సిరీస్ మొత్తం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. కాగా ఈ ఘటనలో అభిమాని రోహిత్ శర్మను తాకలేదని, కేవలం పాదాలపై పడడానికి ప్రయత్నించాడని, రోహిత్ కూడా అతనిని ముట్టుకోలేదని పలువురు చెబుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో ధాటిగా ఆడిన చివర్లో చేతులు ఎత్తేసింది. గప్టిల్(31),డారిల్ మిచెల్(31), గ్లెన్ ఫిలిప్స్ (34) రాణించడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రాహుల్(65), రోహిత్ (55)శర్మ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తరువాత వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ భారత్,పంత్, వెంకటేశ్ అయ్యర్ లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Full View