కేసీఆర్ ను హెచ్చరించిన రైతు.. వీడియో వైరల్

Update: 2019-11-08 10:40 GMT
అది హైదరాబాద్ లో తహసీల్లార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న ధర్నా కార్యక్రమం. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో కానీ ఓ రైతు అక్కడికి చేరుకున్నాడు.. ఈ సందర్భంగా వారి ధర్నానుద్దేశించి.. తహసీల్దార్ విజయారెడ్డి మరణం.. తెలంగాణ పాలన సహా అన్నింటిపై కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేశారు. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదిప్పుడు వైరల్ గా మారింది..

వీడియోలో తెలంగాణలోని వాస్తవ పరిస్థితిని రైతు చెబుతుంటే రెవెన్యూ ఉద్యోగులంతా చప్పట్లతో అతడి వాదనకు మద్దతు తెలుపడం విశేషం.

ఇద్దరు చిన్న పిల్లలున్న తహసీల్లార్ విజయారెడ్డిని చంపడం దారుణమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్లార్ ను చంపిన వాడు కూడా చచ్చాడని చంపినోళ్లు  వెనుక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఉన్నారని టీవీలో, పేపర్లో చదివానని రైతు సంచలన ఆరోపణలు చేశారు. ప్రాణం పోతే తిరిగి రాదని.. హత్యలకు పాల్పడవద్దని.. అధికారులు తప్పులు చేస్తే పై అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ చంపవద్దని సూచించారు.

స్వాంతంత్ర్యం వచ్చాక 72 ఏళ్లు అయినా అభివృద్ధి సాధ్యం కాలేదని.. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుందన్న కేసీఆర్.. ఆయన కుటుంబమే బంగారం అయ్యింది తప్ప.. ప్రజలకు ఏం జరగలేదని రైతు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘కుక్క తోకను ఊపుతుందా? తోక కుక్కను ఊపుతుందా ’ అని రెవెన్యూ శాఖలో అవినీతిపై కేసీఆర్  అసెంబ్లీ లో అన్నాడని.. అదే ఇప్పుడు తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు దారి తీసిందని రైతు సంచలన ఆరోపణ చేశారు. చక్కగా పాలించమని అంటే కోట్ల భూమి కోసం ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఇలా హత్యా రాజకీయాలు చేస్తున్నారని రైతు వీడియోలో ధ్వజమెత్తారు. రాష్ట్రం నిజాం కాలంలా తయారైందని కేసీఆర్ మంచిగా పాలించడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.. రైతు మాట్లాడిన వీడియో ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టేలా ఉంది..


Full View
Tags:    

Similar News