ఆసీస్ క్రికెటర్ కి కరోనా వైరస్..!

Update: 2020-03-13 07:37 GMT
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వైరస్ దెబ్బకి వణికిపోతున్నాయి. సామాన్యుల నుండి వివిఐపిలు వరకు అందరూ కరోనా బాధితులుగా మారుతున్నాయి. ప్రధానులు, మంత్రులు ,సినీ సెలబ్రిటీలు..ఇలా ప్రతి ఒక్కరూ కరోనా భారిన పడుతుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. తాజాగా ఈ కరోనా ఆస్ట్రేలియా క్రికెటర్‌ కి కూడా సోకింది. ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్.. కరోనా బారిన పడ్డట్టు వార్తలు వస్తున్నాయి.

పూర్తి వివరాలు చూస్తే... ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చిన రిచర్డ్‌ సన్ గురువారం రాత్రి తన గొంతులో మంటగా ఉందని టీమ్ వైద్య సిబ్బందికి తెలియజేశాడు. దీనితో వెంటనే అతడిని పరిశీలించిన వైద్యులు.. కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు కొన్ని ఉండటంతో శాంపిల్స్ సేకరించి పరీక్షలు పంపినట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఏదైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారిని 14 రోజులు ఐసోలేషన్‌కి తరలించాలని ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఆదేశించి ఉండటంతో రిచర్డ్‌ సన్‌ ని టీమ్‌కి దూరంగా ప్రత్యేక గదిలో ఉంచినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ చెబుతోంది.

అయితే, న్యూజిలాండ్‌ తో తొలి వన్డే మ్యాచ్‌ కి కొద్దిసేపు ముందే ఆస్ట్రేలియా టీమ్‌ ఆటగాళ్లు కరోనా వైరస్ వార్తతో ఉలిక్కిపడ్డారు. సిడ్నీ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌ తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఆడాల్సి ఉండగా .. కొన్ని గంటల ముందు ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌ సన్‌ కి కరోనా లక్షణాలు కనిపించడంతో అతన్ని ప్రస్తుతానికి జట్టుకి దూరంగా ఉంచారు. అయితే , కేన్ రిచర్డ్‌ సన్‌ కి కరోనా సోకినట్టు ఇంకా నిర్దారణ కాలేదు. రిచర్డ్ సన్‌కి పాజిటివ్ అని తేలితే మ్యాచ్‌ లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కరోనా నెగిటీవ్ గా వస్తే ,,అతను మళ్లీ జట్టుకి అందుబాటులో ఉంటాడని సీఏ ప్రతినిధి తెలిపారు. కాగా , ఐపీఎల్ 2020 సీజన్‌ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున రిచర్డ్‌ సన్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.


Tags:    

Similar News