ఓ తెలంగాణ పోరడు.. కెనడా కుర్రదాన్నో.. లేదంటే ఓ ఆంధ్రా కుర్రోడు.. అమెరికా అమ్మాయిని లైన్లో (ప్రేమించి) పెట్టి పెళ్లి చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. సోషల్ మీడియా ట్రెండ్ వచ్చాక ఇలాంటి పెళ్లిలు ఎక్కడ జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసి పోతున్నాయి. ఇటీవల కాలంలో ఇండియన్లను ఫారిన్ అమ్మాయిలు పెళ్లాడటం కామన్ గా మారిపోయింది.
అయితే వీరంతా ఉన్నత చదువులు చదువుకున్న వారో.. లేదా ఒకే దగ్గర జాబ్స్ చేసే వాళ్లో అయి ఉండటం కామన్ పాయింట్ గా ఉండేది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ప్రేమ పెళ్లి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటం విశేషం. ఓ ఫారెన్ అమ్మాయి ఆటోవాలా ప్రేమకు ఫిదా అయిపోయి పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇలాంటి సంఘటనలు సినిమాల్లో తప్ప నిజజీవితంలో జరగడం చాలా అరుదనే చెప్పచ్చు. అయితే సినిమాను తలదన్నే రీతిలో కర్ణాటకకు చెందిన ఓ ఆటోవాలా బెల్జియం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ న్యూస్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో వీరి ప్రేమి పెళ్లి కథకమామీషు ఏంటో తెలుసుకునేందుకు ప్రతీ ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో విజయ్ నగర్ కు చెందిన అనంత్ రాజు ఆటో నడపడంతో పాటుగా హంపి దేవాలయంలో టూరిస్ట్ గైడ్ గా పని చేస్తున్నాడు. హంపి దేవాలయానికి వచ్చే టూరిస్టులకు ఆలయం యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించే వాడు. అలాగే టూరిస్టులకు అవసరమైన సదుపాయాలను దగ్గరుండి చూసుకునేవాడు.
ఈక్రమంలోనే నాలుగేళ్ల క్రితం బెల్జియంకు చెందిన కెమిల్ ఫ్యామిలీ హంపికి రాగా అనంత రాజు వారికి సహాయం చేశాడు. సామాజిక కార్యకర్త అయిన కెమిల్ కు రాజు ప్రవర్తన ఎంతగానో నచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. అయితే కరోనా రాకతో వీరి వివాహానికి బ్రేక్ పడింది.
ముందుగా బెల్జియం సంప్రదాయం ప్రకారం వివాహం చేయాలని భావించారు. అయితే అనంత్ రాజు కోరిక మేరకు హిందు సంప్రదాయం ప్రకారం ఇండియాలోనే వివాహం చేసేందుకు ఒప్పుకున్నారు. ఈక్రమంలోనే నేటి ఉదయం 9 గంటల 25 నిమిషాలకు హంపిలోని విరూపాక్షేశ్వరుని సన్నిధిలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది.
ఇరు కుటుంబాలు పెళ్లికి ఘనంగా ఏర్పాటు చేశాయి. దీంతో ఆటోవాలా( అనంత రాజు) తన బంధుమిత్రుల సమక్షంలో బెల్జియం యువతి కెమిల్) మెడలో తాళి కట్టేశాడు. దీంతో వీరిద్దరి నాలుగేళ్ల ప్రేమకు శుభం కార్డు పడింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.