నన్ను క్షమించండి నాన్న ... నీట్ పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య !
నేటి విద్యా విధానంతో విద్యార్థుల్లో ఒత్తిడి రోజురోజుకి పెరిగిపోతుంది. అలాగే పోటీ పరీక్షల్లో ర్యాంకులు రావాలని తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక , తల్లిదండ్రుల కోరికలు తీర్చలేక చాలామంది విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన జ్యోతి శ్రీదుర్గ అనే విద్యార్థిని నీట్ పరీక్ష నేపథ్యంలో ఒత్తిడి జయించలేక ప్రాణాలు తీసుకుంది. నీట్ పరీక్షకు ముందురోజు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదానికి గురిచేసింది.
19 ఏళ్ల జ్యోతి శ్రీదుర్గ తన కుటుంబ సభ్యులతో కలిసి మధురైలోని సాయుధ బలగాల క్వార్టర్స్ లో ఉంటోంది. ఆమె తండ్రి మురుగ సుందరం ఐదో బెటాలియన్ లో పనిచేస్తున్నారు. జ్యోతి గతేడాది కూడా నీట్ పరీక్ష రాయగా 100 మార్కులు వచ్చాయి. ఈ ఏడాది నీట్ పరీక్ష కోసం ఆమె తీవ్రంగా కష్టపడింది. కానీ మరోసారి విఫలమైతే, ఎలా అన్న ఆందోళనతో బలవన్మరణం చెందింది. తన గదిలోనే విగతజీవురాలుగా కనిపించింది. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. ఎంతో అలసిపోయాను, నన్ను క్షమించండి' అంటూ ఆ లేఖలో పేర్కొంది. తల్లిదండ్రుల అంచనాలను తాను అందుకోలేకపోతానేమో అని అనేక పర్యాయాలు ఆ లేఖలో ప్రస్తావించింది. తల్లిదండ్రుల ఆశయాన్ని సాధించలేనేమో అన్న ఆందోళనతో సతమతమవుతున్నానని జ్యోతి తన లేఖలో పొందుపరిచింది. అంతేకాదు, ఓ వీడియో సందేశం కూడా ఆమె తన మరణానికి ముందు రికార్డు చేసింది. తన చావుకు మీరు బాధ్యులు కారంటూ తల్లిదండ్రులను ఉద్దేశించి ఆ వీడియోలో చెప్పింది.