కరుగుతున్న కరోనా కేసుల కొండ

Update: 2022-02-06 11:30 GMT
దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా తగ్గాయి. కొత్తగా లక్ష ఏడు వేల కేసులు వెలుగు చూశాయి. మరోవైపు మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. కొత్తగా  865 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,01,979 కు చేరింది. మరోవైపు దేశంలో పాజిటివిటీ రేటు కూడా తగ్గుతూ వస్తోంది. శనివారం 7.82 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు నేడు 7.42కు దిగివచ్చింది.  

నిన్నటితో పోల్చితే కొత్త కేసులు 16  శాతం మేర తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.  మరోవైపు వైరస్  నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కొత్తగా 2,13,246 మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,04,61,148గా  నమోదు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం 12,25,011 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు.  

దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెంచింది ప్రభుత్వం. కేవలం శనివారం ఒక్కరోజే 14,48,513 మందికి పరీక్షలు చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పరీక్షల సంఖ్య 74.01 కోట్లు దాటింది.  

మరో వైపు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కొత్తగా 45,10,770 డోసులు వేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం  డోసుల సంఖ్య 1,69,46,26,697 కి చేరినట్లు పేర్కొన్నారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్తగా 22 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 39.39 కోట్లకు చేరాయి. మరణాలు కాస్త తగ్గి 8,326 గా నమోదయ్యాయి. వీటితో మరణాల సంఖ్య పెరిగి 5,751,840గా ఉంది.
 
అత్యధికంగా కేసులు ఫ్రాన్స్ లో వెలుగు చూశాయి. రెండు లక్షల పద్నాలుగు వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 170 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఆ తర్వాత ఎక్కువ కేసులు రష్యాలో వెలుగు చూశాయి . సుమార 1.77 లక్షల కేసులు నిర్ధారణ అయ్యాయి. 714 మంది చనిపోయారు. మరో వైపు అగ్రరాజ్యం అమెరికాలో కేసులు తగ్గుముఖం పట్టాయి. లక్ష ఐదు వేలు మాత్రమే నమోదు అయ్యాయి. మరణాలు వెయ్యికి పైగా వెలుగు చూశాయి.
Tags:    

Similar News