అతడు మైదానంలో దిగితే ప్రత్యేకం.. 6 అడుగుల ఆరు అంగుళాల ఎత్తు.. 140 పైగా కిలోల బరువు.. క్రికెట్ లో ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇచ్చే ఈ కాలంలో ఏ విధంగానూ అతడు ఏ ప్రమాణాలకూ సరిపోడు.. కానీ, వెస్టిండీస్ భారీకాయుడు రఖీమ్ కార్నివాల్ సంచలనం రేపాడు. టి20ల్లో సెంచరీని ఎక్కువ అనుకుంటే.. ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు.
బాదేశాడు భారీ కాయుడు వెస్టిండీస్ క్రికెటర్లు అంటేనే ఎత్తు, భారీకాయులు. బలమైన మనుషులు. అందులోనూ రఖీమ్ కార్నివాల్ మరింత ప్రత్యేకం. దీనికిమించిన బరువు. అయినప్పటికీ అతడికి ఇవేమీ అడ్డంకి కాలేదు. అమెరికాలోని అట్లాంటా ఓపెన్ లీగ్ టి20 మ్యాచ్ లో కార్నివాల్ డబుల్ సెంచరీ బాదేశాడు. 77 బంతుల్లోనే 205 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 22 సిక్సులున్నాయి. 17 ఫోర్లు కొట్టాడు. అట్లాంటా ఫైర్ తరఫున ఆడిన కార్నివాల్.. టి20ల్లో డబుల్ సెంచరీ ఘనతను అందుకున్నాడు.
దీంతో అట్లాంటా జట్టు నిర్ణీత ఓవర్లలో 326 పరుగుల భారీ స్కోరు చేసింది. దీనిని అందుకునే క్రమంలో ప్రత్యర్థి జట్టు స్వ్కేర్ డ్రైవ్ పాంథర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 154 పరుగులు మాత్రమే చేసింది. అంటే.. అట్లాంటా జట్టు స్కోరును పక్కనపెడితే.. కార్నివాల్ పరుగులకే ఇంకా 51 పరుగుల దూరంలో ఉండిపోయింది. మొత్తమ్మీద 172 పరుగులతో అట్లాంటా జట్టు విజయం సాధించింది.
ఇదీ కార్నివాల్ ప్రత్యేకత వర్తమాన క్రికెట్ లో అత్యంత భారీకాయుడు రఖీమ్ కార్నివాల్. 30 ఏళ్ల రఖీమ్.. 2014లో ఆఫ్ స్పిన్నర్ గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. భారీ షాట్లు కొట్టగల సామర్థ్యంతో అనతి కాలంలో ఆల్ రౌండర్ గా ఎదిగాడు. 2017 లో సూపర్50 టోర్నీలో 252 పరుగులు చేయడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. భవిష్యత్ లో మంచి ఆటగాడిగా ఎదుగుతాడని అప్పట్లోనే పేరు తెచ్చుకున్నాడు.
ఇండియా టూర్ లో కోహ్లిని ఔట్ చేసి 2019లో భారత్ వచ్చిన వెస్టిండీస్ జట్టులో కార్నివాల్ సభ్యుడు. అదే అతడికి తొలిసారి జట్టులో చోటు దొరకడం. నాటి సిరీస్ లో కోహ్లి, పుజారా వంటి మేటి బ్యాట్స్ మన్ ను కార్నివాల్ ఔట్ చేశాడు. ఈ సిరీస్ లో కార్నివాల్ కు అనూహ్యంగా జట్టులో చోటు దొరికింది. నాడు రోస్టన్ చేజ్ గాయపడడంతో కార్నివాల్ కు పిలుపు దక్కింది. దానిని సద్వినియోగం చేసుకున్న అతడు ఇప్పటివరకు వెస్టిండీస్ జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. 9 టెస్టులాడి 238 పరుగులు చేయడమే కాక.. 34 వికెట్లు పడగొట్టాడు.
టి20ల్లో మాత్రం చోటులేదు కార్నివాల్ టెస్టు అరంగేట్రం మూడేళ్ల కిందటే జరిగినా.. ఇంకా టి20లు మాత్రం ఆడలేదు. ఇది విచిత్రమే. వెస్టిండీస్ జట్టులో కార్నివాల్ ను మించిన హిట్టర్లు ఉండడమే దీనికి కారణం.అంతేకాక.. త్వరలో జరగబోయే టి20 ప్రపంచ కప్ జట్టులోనూ కార్నివాల్ లేడు. మరోవైపు కార్నివాల్ ఇంకా వన్డేలు కూడా ఆడలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం 76 మ్యాచ్ లాడాడు. లిస్ట్ లో 50, 66 టి20 మ్యాచ్ లు ఆడాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.