ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ హాకీ పురుషుల టీం చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విశ్వక్రీడల్లోపథకం సాధించింది. గురువారం జరిగిన పురుషుల హాకీ బ్రాంజ్ ఫైట్ లో భారత్ 5-4 తేడాతో బలమైన జర్మనీని చిత్తు చేసింది. అఖండ భారతావనిని ఆనందంలో ముంచెత్తింది. టోక్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. అసాధారణ ఆటతో అద్భుత విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది.1980 తర్వాత ఒలింపిక్స్ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బలమైన ప్రత్యర్థిని భారత్ 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 సంవత్సరాల సుధీర్ఘ విరామం అనంతరం పతకాన్ని సాధించి ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసింది. మ్యాచ్‌లో రెండు, మూడు క్వార్టర్స్ లో భారత స్ట్రయికర్లు సత్తా చాటగా,ఆఖరి క్వార్టర్ లో జర్మనీ క్రీడాకారులు దూకుడు ప్రదర్శించినా, డిఫెండర్లు, గోల్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. పలు పెనాల్టీ కార్నర్లను గోల్ కాకుండా అడ్డుకొని ఒలింపిక్ పతకాన్ని ఒడిసిపట్టారు.
ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 12 హాకీ పతకాలు గెలుపొందగా.. జపాన్ లో భారత్‌కు ఇది రెండో పతకం. టోక్యో 1964 గేమ్స్‌లో సైతం ఫైనల్‌లో పాక్‌ను ఓడించి స్వర్ణం సాధించింది. ఇప్పటి వరకు ఈ విశ్వక్రీడలో ఇప్పటి వరకు భారత్‌కు ఎనిమిది స్వర్ణాలు, ఒక రజత పతకం, మూడు కాంస్య పతకాలు వచ్చాయి. ఈ గెలుపుతో దేశ ప్రజలు అమితమైన ఆనందంలో మునిగిపోయారు. మ్యాచ్‌లో మొదటి క్వార్టర్‌లో 0-1 గోల్స్ తో భారత జట్టు వెనుకపడింది. రెండో క్వార్టర్ లో సిమ్రన్ జీత్ ఒక గోల్ సాధించి.. స్కోరును 1-1 సమమం చేశాడు. ఆ తర్వాత జర్మనీ ఆటగాళ్లు రెండు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 3-1 పెంచుకున్నారు. హర్ధిక్ సింగ్, హర్మన్ ప్రీత్ చెరో గోల్ సాధించగా.. 3-3తో సమం చేశారు. మూడోక్వార్టర్ లో జర్మనీపై భారత్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.
ఇందులో భారత్ రెండు గోల్స్ సాధించింది. రూపిందర్ పాల్ నాలుగో గోల్ సాధించగా.. సిమ్రన్ జిత్ ఐదో గోల్ వేసి, 5-3కు పెంచాడు. మూడో క్వార్టర్ ముగిసే వరకు భారత్ 5-3తో ఆధిక్యంలో ఉంది. అయితే నాలుగో క్వార్టర్‌లో జర్మనీ గోల్ సాధించి ఆధిక్యాన్ని 5-4కు తగ్గించింది. స్కోర్ ను సమం చేసేందు కు జర్మనీ ఎంత ప్రయత్నించినా భారత ఆటగాళ్లు అవకాశం ఇవ్వలేదు. రెండు, మూడు క్వార్టర్స్ లో భారత స్ట్రయికర్లు సత్తా చాటగా, ఆఖరి క్వార్టర్ లో జర్మనీ క్రీడాకారులు దూకుడు ప్రదర్శించినా, డిఫెండర్లు, గోల్ కీపర్ గోల్స్ కాకుండా అడ్డుకున్నారు. పలు పెనాల్టీ కార్నర్లను గోల్ కాకుండా చూశారు. భారత్ 17, 21, 29, 31, 34 నిమిషాల వ్యవధిలో గోల్స్ వేయగా.. జర్మనీ 2, 24, 45, 48 నిమిషాల్లో గోల్స్ సాధించింది. రెండు గోల్స్‌తో భారత విజయంలో సిమ్రన్ జీత్ కీలకపాత్ర పోషించాడు.
ప్రస్తుతం పంజాబ్, హరియాణాల్లో ఆటగాళ్ల ఇళ్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. జట్టులోని పంజాబ్ ఆటగాళ్లు ఒక్కొక్కరికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఆ రాష్ట్ర క్రీడా మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి ఈ విషయం ప్రకటించారు. భారత హాకీలో ఇదొక మరిచిపోలేని రోజు. పంజాబ్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ప్రతి ఆటగాడికి కోటి రూపాయలు నజరానా ప్రకటించడం ఆనందంగా ఉంది. పతకంతో ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు తిరిగొస్తారా అని ఎదురుచూస్తున్నాం అని గుర్మీత్‌సింగ్ అన్నారు. భారత్ వచ్చిన వెంటనే ఈ నజరానాను అందించనున్నట్లు స్పష్టం చేశారు. భారత హాకీ జట్టులో ఎనిమిది మంది పంజాబీలు ఉన్నారు. కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్‌పాల్ సింగ్, హార్దిక్ సింగ్, శంషీర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ పంజాబ్‌కు చెందినవారే. స్వర్ణం గెలిస్తే ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు అందజేస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. ఇప్పుడు కాంస్యం తేవడంతో కోటి రూపాయలు ఇవ్వనుంది.