ట్విట్టర్ కొన్న ఎలన్ మస్క్ కు భారీ షాక్

Update: 2022-04-27 12:30 GMT
ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన మస్క్ ఏకంగా 44 బిలియన్ డాలర్లు (రూ.3.36 లక్షల కోట్లు) వెచ్చించి మరీ  ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు.  ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి వెళ్లాక ‘వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఉంటుందని ప్రకటించారు. ట్విట్టర్ లో కొన్ని ఆప్షన్లు తొలగించడం.. చేర్చడం చేస్తానని ప్రకటించారు.

ఎలన్ మస్క్ ప్రస్తుతం టెస్లా సీఈవోగా కొనసాగుతున్నారు. అయితే ట్విట్టర్ కొనుగోలు అనంతరం మస్క్ కు టెస్లా రూపంలో భారీ షాక్ తగిలింది. ట్విట్టర్ సంస్థకు 21 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉండగా.. ఇందుకోసం టెస్లా షేర్లను అమ్మేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో మంగళవారం ట్రేడింగ్ లో టెస్లా షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఏకంగా 126 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.

టెస్లా షేర్లు పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. గ్లోబల్ ఎకానమీ మందగించడం.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుదలపై పెట్టుబడిదారుల ఆందోళన మరో కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ట్విట్టర్ కొనుగోలు ఒప్పందంలో భాగంగా టెస్లాలోని రూ.12.5 బిలియన్ మార్జిన్ రుణాన్ని కూడా మస్క్ తీసుకున్నారు. ఇప్పుడు మరిన్ని టెస్లా షేర్లు విక్రయానికి సిద్ధమవ్వడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో టెస్లా షేరు ధర భారీగా పడిపోయింది.

టెస్లా ధర ప్రీపాల్ లో కొనసాగితే మస్క్ కు ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని కోలుకోలేకపోవచ్చని తెలుస్తోంది.
Tags:    

Similar News