అతడో శాడిస్ట్ - సైకో.. భార్య ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఏక్కడి కెళ్లినా డౌటే. నీకు ‘బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదూ! ఇవాళ వచ్చాడా! నేను వెళ్లిపోయాక వచ్చే ఉంటాడు. ఎన్నాళ్లుగా సాగుతుంది ఈ వ్యవహారం. అతడితో ఎప్పుడు వెళ్లిపోతున్నావు’ ఇటువంటి ప్రశ్నలతో నిరంతరం భార్యను వేధిస్తుంటాడు. ఇంతటితో ఆగలేదా దుర్మార్గుడు. తన ఇంటికి మొత్తం సీసీకెమెరాలు అమర్చాడు. హాల్ - బాల్కనీ - కిచెన్ - చివరకు బాత్ రూం, -బెడ్ రూంలో కూడా కెమెరాలు పెట్టాడు. అతడు శాడిస్ట్ ప్రవర్తనను కన్నకూతురు కూడా సహించలేకపోయింది.
‘ఎందుకిలా చేస్తున్నారు నాన్న’ అని ప్రశ్నించింది. అయినా అతడి తీరు మారలేదు. ఎదురుచెప్పిన భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. గుజరాత్ లోని వడోదరలో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో మాజీ నావికాధికారిగా పనిచేసిన రతన్ సింగ్ లాలా ( పేరుమార్చాం) వడోదరలో ఉంటున్నాడు. అతడి భార్య ఇటీవల పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ కోసం కొన్నాళ్లు ముంబైకి వెళ్లింది. అయితే అప్పటినుంచే అతడిలో అనుమాన బీజం పడింది. తాను ఇంట్లో లేని సమయం చూసి అపరిచితులు వస్తున్నారని భావించిన అతడు ఇంటి మొత్తం సీసీటీవీ కెమెరాలతో నింపేశాడు. బెడ్రూమ్ - బాత్రూమ్‌ల్లో కూడా కెమెరాలు పెట్టడంతో భార్య - కుమార్తెలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బాత్ రూంలో - బెడ్రూమ్ లో ఉంచిన కెమెరాలు తొలగించాలని ఇటీవల భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త.. భార్య మొబైల్ ఫోన్ ను పగలగొట్టాడు. ఆమె ఆధార్ - పాస్ పోర్ట్ ఒరిజినల్స్ తనదగ్గరే పెట్టుకున్నాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. కాగా పోలీసులు ఫిర్యాదు నమోదు చేయలేదు. దీంతో ఆమె లాయర్లు జైదీప్ వర్మ - చంద్రకాంత్ దవానీల సాయంతో కోర్టును ఆశ్రయించింది. స్పందించిన కోర్టు బాధితురాలికి, ఆమె పిల్లలకు ఇబ్బంది కలిగించవద్దని వారి అవసరాలకు నెలకు రూ.40,000 చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదు చేసినా కేసు పెట్టకపోవడమేమిటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.