ఫుట్ బాల్ వరల్డ్ కప్ లైవ్ ఇస్తుండగా జర్నలిస్టు బ్యాగ్ చోరీ

Update: 2022-11-22 13:30 GMT
ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ ఫుట్ బాల్ ను కవర్ చేసేందుకు వందలాదిమంది విదేశీ జర్నలిస్టులు చేరుకున్నారు. మ్యాచ్ లు జరిగే స్టేడియాల వద్దకు వెళ్తూ..
లైవ్ బ్రాడ్ కాస్టింగ్ ఇస్తూ తమ టీవీ చానళ్లకు ఫీడ్ అందజేస్తున్నారు.

దీంతోపాటు గొప్ప ఆటగాళ్ల ఇంటర్వ్యూలు చేస్తూ.. మ్యాచ్ విశేషాలు చెబుతూ హడావుడిగా ఉన్నారు.ఇలాంటి సమయంలో వీరికి భిన్న అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రపంచ కప్ సందర్బంగా వచ్చిన అతిథులను దోచుకుంటూ దొంగలు తమ చేతివాటం చూపుతున్నారు.అర్జెంటీనా మహిళా జర్నలిస్టుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

కార్డులున్నాయి ఇప్పించండి చాలు డొమినిక్ మెట్జర్ లైవ్ ఇస్తుండగా.. దొంగ ఒకరు ఆమె చేతి బ్యాగ్ ను తస్కరించడం గమనార్హం. దీంతో అవాక్కయిన ఆమె లైవ్ కొనసాగించింది. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసుల స్పందన చూసి అవాక్కవడం ఆమె వంతైది. "హైటెక్ కెమెరాలతో పరిశీలన చేస్తాం. ఫేస్ ఐడెంటిఫికేషన్ తో అతడిని పట్టుకుంటాం. మీకు ఏ విధమైన న్యాయం కావాలి?" అని పోలీసులు కోరడంతో మెట్జర్ ఆశ్చర్యపోయింది.

"ఐదేళ్ల జైలు శిక్ష విధించమంటారా?"లేక "దేశ బహిష్కరణ" చేయమంటారా? అంటూ అడిగేసరికి మెట్జర్ నోరెళ్లబెట్టింది. కాగా, అర్జెంటీనా కాస్త ప్రగతిదాయక దేశమే. అక్కడ చిన్న నేరాలకు ఇంత పెద్ద శిక్షలుండవు. అదే ఖతార్ లో సంప్రదాయం పాటిస్తారు. దీంతో నేరాలకు శిక్షలు తీవ్రంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే దొంగకు పడే శిక్ష గురించి చెప్పడంతో ఆమెకు ఆశ్చర్యం వేసింది. అయితే, "ముందు ఆ బ్యాగులోని నా పత్రాలు (వీసా తదితర), కార్డులు ఇప్పించండి. మిగతావాటి సంగతి తర్వాత" అని మెట్జర్ పోలీసులను కోరింది.

వేలాదిమంది తాత్కాలిక నియామకం ఖతార్ చాలా చిన్న దేశం. మొత్తం జనాభా 30 లక్షలు కూడా ఉండదు. అయితే, చమురుతో సంపన్నమైన దేశం ఇది. అలాంటి దేశానికి ప్రపంచ కప్ ఫుట్ బాల్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ నిర్వహించే అవకాశం దక్కింది. దీంతో వేలాదిమంది వలస కార్మికులను నియమించుకుని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో 6 వేల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వచ్చాయి. సహజంగానే వీరిలో భారతీయులు, బంగ్లాదేశ్, పాకిస్థానీలు అత్యధికంగా ఉండొచ్చు. మరోవైపు ఖతర్ లో ప్రపంచ కప్ సందర్భంగా భద్రతా పరమైన అంశాలు ప్రధాన అంశంగా మారాయి.

భారీ స్థాయిలో భద్రతా సిబ్బందిని నియమించుకునే అవకాశం లేక.. ఖతర్ యంత్రాంగం వందలాది మందిని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంది. వీరిలో కొందరిని కనీస అనుభవం కూడా లేదు. ఇలాంటివారందరినీ స్టేడియంలలో ప్రేక్షకులను నియంత్రించే సెక్యూరిటీ గార్డులుగా నియమించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News