భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విమానాల్లో ప్రయాణికులకు సేవలు అందించే ఎయిర్ హోస్టెస్ లు ఇప్పుడు మీకు రైలులో కూడా కనిపించనున్నారు. రైలు ప్రయాణం చేసే వారికి మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఈ సేవలను కేవలం కొన్ని రైళ్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు అధికారులు. ఎంపిక చేసిన వారికి రైళ్లలో మాత్రమే ఈ సేవలను ప్రవేశ పెట్టాలని కేంద్రం భావిస్తుంది. పైలెట్ ప్రాజెక్ట్గా భారతీయ రైల్వే శాఖ చేపట్టింది. ఇది కానీ విజయవంతం అయితే మరింత ముందుకు తీసుకుని పోవాలని భావిస్తుంది. దీనిపై మాట్లాడిని రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రీమియం రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యాన్ని తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. రోజురోజుకు భారతీయ రైల్వే అన్నీ రకాలుగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే ప్రయాణికులకు మంచి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ట్రైన్ హోస్టెస్ లను ప్రవేశ పెట్టాలని కేంద్రం ముందు నుంచే భావించందని తెలిపారు. ఇప్పటికే రైళ్లలో మగ అటెండర్లు ఉంటాని గుర్తు చేసిన అధికారులు, తాజాగా భారతీయ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో మహిళలు కూడా అటెండర్లుగా ఉండనున్నట్లు ప్రకటించారు. అయితే ఇంతకు ముందు భారతీయ రైల్వేలో మహిళా అటెండర్లు ఉండే వారు కాదు. కానీ ఈ నిర్ణయం తో రైల్వేలో ట్రైన్ హోస్టెస్ లు ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇప్పటికే భారతీయ రైల్వే సుమారు 25 పైగా ప్రీమియం రైళ్లను నడుపుతుంది. ఈ రైళ్ల అన్నింటిలో ఈ సౌకర్యం ఉంటుందని శాఖ చెప్పడం లేదు. కేవలం కొన్ని నిర్దేశించిన రైళ్లలోనే ఉండనున్నట్లు పేర్కొంది. సాధారణంగా ప్రీమియం రైళ్ల జాబితాలో ఉండే గతిమాన్, తేజస్, వందే భారత్ రైళ్లలో ఈ సౌకర్యాన్ని ముందుగా ప్రవేశ పెట్టనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే మన దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ఒకటైనా రాజధాని ఎక్స్ ప్రెస్ లలో ఈ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టకపోవడం పై కొందరు ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
మరోవైపు ట్రైన్ హోస్టెస్ లను సాధారణ రైళ్లలో ప్రవేశపెట్టే దానిపై ఇంకా నిర్ణయం ప్రకటించలేదు అధికారులు. ప్రస్తుతానికి కేవలం ప్రీమియం రైళ్లలోనే ట్రైన్ హోస్టెస్ లను ప్రవేశ పెట్టాలనే దానికి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. అయితే ట్రైన్ హోస్టెస్ లు కేవలం పగటి పూట మాత్రమే ఈ సేవలను అందిచనున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి పూట వీరి సేవలను వినియోగించుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా వీరు రైలు ఎక్కేటప్పుడు ప్రయాణికులను పలకరించడం చేస్తారు. దీనితో పాటు ప్రయాణంలో వారికి ఆహారాన్ని అందించడం, వారి బాగోగులు చూడడం లాంటి వీరి విధులుగా ఉన్నాయి.
టూరిజం అండ్ హాస్పిటాలిటీలో శిక్షణ తీసుకున్న మహిళలకు మాత్రమే ట్రైన్ హోస్టెస్ లుగా అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు.