గడచిన ఎనిమిది నెలలుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తొందరలోనే కీలక మలుపు తిరగబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఒకవైపు యుద్ధం జరుగుతున్నా మరోవైపు రష్యా ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. రష్యాలో కలిసిపోవాలని కోరుకునే విషయంలో ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాల్లో జనాభిప్రాయాన్ని రష్యా సేకరించింది.
ఉక్రెయిన్ కు ఎంతో కీలకమైన డోనట్స్క్, జపోరిజియా, ఖేర్సన్, లుహాన్స్క్ నగరాల్లో రష్యా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. 23-27 తేదీల మధ్య జరిగిన అభిప్రాయాల సేకరణలో అత్యధికులు రష్యాలో కలవాలని కోరుకుంటున్నట్లు తేలిందని రష్యా అనధికారిక లీకులిచ్చింది. దాంతో అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు రష్యాపై మండిపోతున్నాయి. పై నాలుగు ప్రాంతాలను రష్యా తనలో కలిపేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నాయి.
దీనికి కారణం ఏమిటంటే అమెరికాతో పాటు రుమేనియా, పోలండ్, బెలారస్ లాంటి దేశాలకు పై ప్రాంతాలు ఎంతో కీలకమైనవి. ఉక్రెయిన్లోని ఖేర్సన్ అతి ముఖ్యమైన ఓడరేవు నగరం. ఉక్రెయిన్ ద్వారానే కొన్ని దేశాల తమ ఉత్పత్తులను ప్రపంచదేశాలకు పంపుతున్నాయి.
ఇపుడు గనుక రెఫరెండం పేరుతో రష్యా పై ప్రాంతాలను తనలో కలిపేసుకుంటే పై దేశాలకు ఇబ్బందులు మొదలవుతాయి. అందుకనే రష్యా చర్యను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. రెండు మూడ్రోజుల్లో ప్రజాభిప్రాయం ప్రకారం పై నాలుగు ప్రాంతాలను రష్యాలో కలిపేసుకోబోతున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటిస్తారని అనుకుంటున్నారు.
ఆ ప్రకటనను ఎలాగైనా అడ్డుకోవాలన్నదే అమెరికా, నాటో దేశాల ప్రయత్నాలు. పుతిన్ గనుక ప్రకటన చేసేస్తే వెంటనే రష్యా సైన్యం పై ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసేసుకుంటాయి. అప్పటి నుంచి అధికారికంగా ఉక్రెయిన్లోని నాలుగు కీలక నగరాలు రష్యాలో కలిసిపోతాయి.
తమ ప్రయత్నాలను గనుక అమెరికా, నాటో దేశాలు అడ్డుకుంటే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు వెనకాడేది లేదని గతంలోనే పుతిన్ హెచ్చరించారు. ఆ హెచ్చరికలే నిజమైతే ప్రపంచ దేశాల పరిస్ధితి చాలా అన్యాయమైపోతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.