143మంది అత్యాచారం కేసులో కీలక ట్విస్ట్

Update: 2020-08-27 11:10 GMT
తనపై సినీ ప్రముఖులు, వారి పీఏలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, జర్నలిస్టులు కలిసి మొత్తం 143మంది అత్యాచారం చేశారని ఓ 24 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు తెలంగాణలో సంచలనమైంది. దీంతో కేసును సీసీఎస్ కు బదిలీ చేయగా వారు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.

బాధితురాలి స్టేట్ మెంట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారించేందుకు నడుం బిగించారు. ఈ క్రమంలోనే 143మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. 42 పేజీలతో ఎఫ్ఐఆర్ రెడీ చేశారు.

కాగా యువతిపై అత్యాచారం చేసిన వారిని అరెస్ట్ చేయాలని.. సీబీఐ విచారణ జరపాలని ఏబీవీపీ నేతలు ఆందోళన చేశారు. కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.

ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. 9 ఏళ్లుగా తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తున్న యువతి ఇప్పుడు కంప్లైట్ ఇవ్వడం అనుమానాలు తావిస్తోంది. దీనివెనుక ఒక ఎన్జీవో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఫిర్యాదు ఆధారంగా 9 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజులు, ఆధారాలు దొరకడం కష్టమేనని పోలీసులు భావిస్తున్నారు. సంచలనంగా మారిన ఈ కేసులో సూత్రధారులు ఎవరు? బాధితురాలిని అడ్డం పెట్టుకొని ఎవరైనా కథ నడిపిస్తున్నారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.

ఈ కేసులో ఆధారాలు దొరకడం కష్టంగా మారింది. 9 ఏళ్లుగా జరిగిన ఈ వ్యవహారంపై న్యాయ నిపుణుల సలహాతో పోలీసులు ముందుకు వెళుతున్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.




Tags:    

Similar News