చంద్రబాబుని రాజకీయాన్ని వేరు చేసి చూడగలరా. ఆయన పుడుతూనే రాజకీయాన్నే కోరుకున్నారు. అది ఆయన శ్వాస. బాబు కంటే ఎవరూ ఎక్కువగా పాలిటిక్స్ ని ప్రేమించరు అని ఆయన్ని ఎరిగిన వారు చెబుతారు. ఆయన జీవితమంతా రాజకీయాల్లోనే బిజీ బిజీగా గడిపారు. అధికారంలో ఉంటే సరే సరి, ఓడినా కూడా బాబు విరామం లేకుండా ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోనే గడుపుతారు.
అలాంటి బాబు సడెన్ గా వారం రోజుల పాటు బ్రేక్ అనేశారు. అది కూడా సీక్రెట్ గానే జరిగింది అనుకోండి. బాబు ఇపుడు ఎక్కడ ఉన్నారూ అంటే థాయ్ ల్యాండ్ అని చెప్పాలి. బాబు ఫ్యామిలీలో సహా అక్కడ ల్యాండ్ అయి ఇప్పటికి అయిదు రోజులు అయిందిట. ఆయన తన కుటుంబ సభ్యులతో సహా ఈ నెల 24న హైదరాబాద్ నుంచి బయల్దేరి థాయ్ లాండ్ కి చేరుకున్నారుట.
కంప్లీట్ గా విహారయాత్రగా దీన్ని డిజైన్ చేసుకున్నారుట. ఈ ఏడాది లో అత్యధిక భాగం కరోనా రెండవ దశ తో గడచిపోయింది. ఇక ఏపీలో లోకల్ బాడీస్ సహా ఉప ఎన్నికలు రాజకీయాలతో 2021 క్యాలండర్ మొత్తం టీడీపీ అధినేత చకచకా తిప్పేశారు. దాంతో ఆయనకు సరిగ్గా ఇయర్ ఎండింగ్ లో ఖాళీ దొరికినట్లుంది. లేదా ఫ్యామిలీ కోరినట్లుంది.
మరికెందుకు ఆలస్యం అనుకున్నారో ఏమో కానీ చంద్రబాబు చలో టూర్ అనేసారు. అలా హాలీడే ట్రిప్ కోసం ఆయన థాయ్ ల్యాండ్ కి చేరుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. అక్కడ ఆయన కులసాగా హాయిగా గడుపుతున్నట్లుగా చెబుతున్నారు. బాబు ఈ తిరిగి వచ్చేది ఈ ఏడాది మాత్రం కాదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు, ఈ క్యాలండర్ లో ఉండేది ఇక రెండే రోజులు. సో 2022 జనవరి 2న బాబు హైదరాబాద్ కి తిరిగి వస్తారని చెబుతున్నారు.
కాగా చంద్రబాబు హాలీ డే ట్రిప్ ఇలా సీక్రెట్ గా జరగడం మాత్రం కొంత ఆశ్చర్యంగానే ఉన్నా కావాలనే ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాలతో తెగ బిజీ అయి ఒక దశలో విసిగివేసారిన బాబుకు ఈ హాలీ డే ట్రిప్ ఫుల్ రీచార్జిని ఇస్తుందని తమ్ముళ్ళు అంటున్నారు. కొత్త ఏడాదిలో సరికొత్తగా ఉత్సాహంగా బాబు టీడీపీని పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతారని అంతా అంటున్నారు. సో ఈసారి న్యూ ఇయర్ కి బాబు ఉండేది థాయ్ ల్యాండ్ లో అన్న మాట.