నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిలే అంటున్న డాక్టర్ .. లక్షణాలు మాత్రం ఇలా ఉండాల్సిందేనట !

Update: 2020-09-11 23:30 GMT
ఓ డాక్టర్ ఒంటరితనాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటికే ఉన్న గర్ల్‌ఫ్రెండ్ కూడా అతగాడి కుళ్లు జోకులకి నవ్వలేక బ్రేకప్ చెప్పేసింది. దీనితో అతడికి ఏం చేయాలో కూడా పోలుకోలేదు. సెన్సాఫ్ హ్యూమర్ ఉండే అబ్బాయిలు లవర్‌ గా దొరకడాన్ని చాలామంది లక్కీగానే భావిస్తారు. కానీ, ఆ డోస్ ఎక్కువైతే మాత్రం..ప్రేమను కూడా జోకుగా తీసుకుంటున్నాడు అని అనుకుంటారు. ఈ డాక్టర్ బాబు విషయంలో కూడా అదే జరిగింది. దీనితో ఈ సారి తన జీవితంలోకి వచ్చే పిల్ల, తన నవ్వులకు నవ్వలేగానీ, బ్రేక్ చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు. ట్విట్టర్ వేదికగా , గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే ఈసారి ప్రేమను ప్రేమగా కాకుండా ఓ ఉద్యోగంగా భావించే యువతి కోసం వెతుకుతున్నాడు. పైగా ఆమెకు జీతాన్ని కూడా ఇస్తాడట.

మలేషియాకు చెందిన డాక్టర్ మహమ్మద్ నకీబ్.. ఇటీవల ‘ఉద్యోగ అవకాశం’ అంటూ ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు. తన జీవితంలో లేడీ లవ్‌గా ఉద్యోగం చేసేందుకు పరిపక్వత కలిగిన అమ్మాయి కావాలని కోరాడు. ఆమెకు వంట చేయడంతోపాటు మీమ్స్ షేర్ చేయడం, కేక్స్ చేయాలని చెప్పాడు. అలాగే, అతడి కలిసి నిద్రపోవాలట కూడా.. ఈ సందర్భంగా నకీబ్ తన క్వాలిటీస్‌ ను కూడా వివరించాడు. తన చేతిలో ఒక చాక్లెట్ బార్ ఉంటుందని, దాన్ని ఎప్పుడు నోరు మూసుకుని చప్పరిస్తూ ఉంటానని తెలిపాడు. తాను ఒక డాక్టర్ అని, కారు కూడా ఉందని.. కానీ, ఇప్పటికీ తాను పేదవాడినేనని తెలిపాడు. నేను చూసేందుకు అందంగా ఉండను. కానీ, మీకు మంచిగానే కనిపిస్తాను. పైగా నేను పెద్ద ప్రమాదకారిని కూడా కాదు. ఎత్తులంటే మాత్రం చచ్చేంత భయం అని చెప్పుకొచ్చాడు. ఈ జాబ్ చేసే అమ్మాయికి పెర్ఫార్మెన్స్, బర్త్‌డే బెనిఫిట్స్ కోసం నెలకు కమీషన్లు ఇస్తానని వెల్లడించాడు. అంతేగాక.. తనతో 24/7 ఉండాలని, తన జోకులకు తప్పకుండా నవ్వాలని తెలిపాడు. అలా ఉంటేనే తన ఫ్యామిలీ ఈవెంట్స్‌కు ఆమెను కూడా తీసుకెళ్తానని చెప్పాడు. ఇవన్నీ అతడు ఓ ప్రజంటేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ట్విట్టర్లో సరదాగా పోస్టు చేశాడు. అయితే, అది ఊహించని విధంగా వైరల్‌గా మారింది. అతడి సరదా ట్వీట్‌ను మీరు చూసేయండి మరి.
Tags:    

Similar News