1945లో 5వేలమందిని చంపితే 2020లో శిక్ష ఖరారు !

Update: 2020-07-27 11:30 GMT
అదేంటి 1945లో 5వేలమందిని చంపితే 2020లో శిక్ష ఖరారు చేశారా ..అదేమిటి న్యాయ వ్యవస్థ అంత వేగంగా పనిచేస్తుందా? అని అనుకుంటున్నారా ? అయితే దీనిపై పూర్తి వివరాలు చూస్తే .. జర్మనీ గురించి కానీ ,హిట్లర్ గురించి తెలిసిన వారికీ హోలోకాస్ట్ మారణకాండ గురించి కూడా దాదాపుగా తెలిసే ఉంటుంది. ఆ మరణకాండ లో దాదాపుగా 65 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో 1944-45 మధ్యకాలంలో ఇది జరిగింది.

ఆ యుద్ధ సమయంలో నాజీ కాన్సన్ట్రేషన్ కాంప్ గార్డ్ గా బ్రూనో డెయ్ అనే వ్యక్తి పనిచేశాడు. అప్పటికి అతని వయస్సు కేవలం 17 సంవత్సరాలు. హిట్లర్ హోలోకాస్ట్ మారణకాండలో డెయ్ కూడా పాలుపంచుకున్నారు.అందులో ఈ బ్రూనో డెయ్ దాదాపుగా 5వేలమందిని చంపేశాడు. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత డెయ్ కు కేవలం రెండు నెలల సస్పెన్షన్ విధించి వదిలేసింది. అయితే, దానికి సంబంధించిన కేసులో డెయ్ ను జర్మనీ కోర్టు తాజాగా దోషిగా తేల్చింది. ఇప్పుడు అయన వయస్సు 93 ఏళ్ళు. 1945 లో జరిగిన మారణకాండకు 2020లో శిక్ష విధించడం గమనార్హం. అయితే, డెయ్ కు ఎలాంటి శిక్ష వేయబోతున్నారో కోర్టు ఇంకా వెల్లడించలేదు.
Tags:    

Similar News