ఓ డిటర్జెంట్ పౌడర్ కి సంబంధించి టీవీల్లో తరచూ 'మరక మంచిదే ' అంటూ ఓ యాడ్ వస్తుంటుంది. మరక మంచిదేంట్రా బాబూ.. అనిపించినా..ఆ యాడ్ భలే క్లిక్ అయ్యింది. ఇప్పుడు 'మద్యం కూడా మంచిదే' అంటే నమ్మాల్సిందే నేమో. పిల్లలకు మద్యం బాటిళ్లు ఎవరూ గిఫ్ట్ గా ఇవ్వరు. పాడైపోతారని. కానీ ఓ వ్యక్తికి తనకు గిఫ్ట్ గా వచ్చిన మందు బాటిళ్లతో ఏకంగా లైఫ్ లో సెటిల్ అయ్యాడు. వినడానికి ఇది ఆశ్చర్యకరంగా ఉన్నా..ఇది.. నిజం.ఎవరన్నా మందుబాటిళ్లను బహుమతిగా ఇస్తే తాగి ఎంజాయ్ చేస్తారు. కానీ న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం కొంచెం భిన్నంగా ఆలోచించాడు.
తనకు బహుమతిగా వచ్చిన 28 మందుబాటిళ్లను దాచుకొని వాటిని చాలా ఏళ్ల తర్వాత అమ్మి ఏకంగా 40 లక్షలు సంపాదించాడు. చివరకు ఇప్పడు ఆ డబ్బుతో ఇళ్లు కట్టుకున్నాడు. 28 ఏళ్ల పాటు ఆయనకు మందుబాటిళ్లను బహుమతిగా ఇచ్చింది మరెవరో కాదండి! అతడి తండ్రే. ఈ స్టోరి ఏమిటీ? ఎక్కడ జరిగిందో కాస్త తెలుసుకుందాం.. న్యూయార్క్‌కు చెందిన పీట్ రాబ్సన్‌కు.. 1992 లో మాథ్యూ జన్మించాడు. అయితే వారి మత ఆచారం ప్రకారం కొడుకు పుట్టిన వెంబడే అతడి తలకు విస్కీని రాస్తారు.
అయితే పీట్ రాబ్సన్ మాత్రం తన కుమారుడికి ప్రతి ఏటా పుట్టినరోజునాడు ఓ విస్కీ బాటిల్‌ను బహుమతిగా ఇచ్చేవాడు. ఇలా ఇప్పుడు అతడికి 28 ఏళ్లు రావడంతో మొత్తం 28 విస్కీ బాటిళ్లను సేకరించి పెట్టుకున్నాడు. వాటిని విక్రయించేందుకు అతడు ఆన్లైన్లో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో ఆ విస్కీ బాటిళ్లకు అతడికి రూ. 40 లక్షల ధర పలికింది. ఆ డబ్బుతో మాథ్యూ ఓ ఇంటిని కొనుగోలు చేయబోతున్నాడట. మద్యం ఓ వ్యసనం..కానీ ఇతడికి మాత్రం మద్యం ఓ సెటిల్ మెంట్ ఇచ్చింది.