రోజు రోజుకూ యువతలో ఉన్మాదం ఎక్కువవుతోంది. ప్రేమ పేరుతో వెంటపడటం.. అంగీకరించకపోతే చంపేయడం, దాడికి పాల్పడటం చేస్తున్నారు. అమ్మాయిలను వేధిస్తున్నవారిని కఠినంగా శిక్షిస్తున్నా..ఉరి తీస్తున్నా చివరికి ఎన్ కౌంటర్ చేస్తున్నా మారటం లేదు. తాజాగా హర్యానాలో ఓ యువతిని కారు ఎక్కాలని కోరగా యువతి తిరస్కరించినందుకు ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ బల్లబ్ ఘడ్ లో ఓ కళాశాల నుంచి పరీక్ష రాసి ఓ యువతి బయటికి రాగా.. అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న ఓ యువకుడు పక్కనే ఉన్న కార్లో ఎక్కాలని కోరాడు. వారిద్దరికీ ఒకరికొకరు తెలుసు. అయినా ఆ యువతి ఎందుకో కారు ఎక్కనంటూ నిరాకరించింది. వెంట రానంటూ తెగేసి చెప్పింది.
ఆ యువకుడు ఆమె చేయి పట్టుకొని కార్లో ఎక్కించే ప్రయత్నం చేయగా.. ఆమె పట్టు విడిపించుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన వెంట తెచ్చుకున్న గన్ తో ఆమెపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. అక్కడ్నుంచి హుటాహుటిన పారిపోయాడు. కళాశాలలోనే సహచరులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె తీవ్రగాయాలతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడ్డ యువకుడి కోసం గాలింపు చేపట్టారు. కాల్పులకు పాల్పడ్డ యువకుడికి ఆ యువతి ముందే పరిచయం ఉందని పోలీసులు తమ దర్యాప్తులో నిర్ధారించారు. అతడి స్వస్థలం మేవాత్ అని వారు చెప్పారు. యువతిపై కాల్పులు జరపటానికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.