రోజులు గడుస్తున్న కొద్దీ అసహనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇప్పుడు అలాంటి సన్నివేశానికి సంబంధించిన ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. తాలిబన్ల తరహాలో.. మోరల్ పోలీసింగ్ చేస్తున్న వారి తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భార్యతో కాస్తంత సన్నిహితంగా ఉంటూ ముద్దు పెట్టినంతనే.. ఇష్టారాజ్యంగా దాడి చేసిన వైనం చూస్తే.. ఎక్కడి నుంచి ఎక్కడకు వెళుతున్నామన్న భావన కలుగక మానదు. శ్రీరామచంద్రుడి జన్మస్థలిగా చెప్పే అయోధ్యలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిస్తే.. దేశంలో వస్తున్న మార్పులకు ఆందోళన కలుగక మానదు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీరాముడి జన్మస్థలి అయిన అయోధ్యలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అయోధ్యలో ప్రవహించే సరయూ నదిలో ఒక జంట స్నానం చేయటానికి నదిలోకి దిగింది.
ఈ సందర్భంగా ఈ జంట కాస్త సన్నిహితంగా ఉండటమే కాదు.. తన భార్యతో కాస్తంత రొమాంటిక్ అన్న చందంగా.. ముద్దు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి ఇలా చేయకూడదంటూ భార్యతో ఉన్న భర్తను పక్కకు లాగేశాడు.
దీంతో.. సదరు భర్తకు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఆ షాక్ లో ఉండగానే.. జబ్బ పట్టుకొని లాగిన వ్యక్తి భర్తను చెంప దెబ్బ కొట్టటంతో మొదలైన అరాచకం.. నదిలో వారి చుట్టూ ఉన్న వారిలో పలువురు ఆ భర్త మీద చేయి చేసుకోవటంతో ఆ భార్య బిక్కముఖం వేసిన పరిస్థితి. తన కళ్ల ముందే భర్తకు అలా జరగటాన్ని జీర్ణించుకోలేని ఆమె.. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆ భర్తకు మరిన్ని దెబ్బలు పడిన పరిస్థితి.
అయోధ్యలో ఇలాంటి పనులు సహించమంటూ ఒక వ్యక్తి వ్యాఖ్యానించటం చూస్తుంటే.. మనం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతున్నామన్న భావన కలుగక మానదు. భార్యతో భర్త సన్నిహితంగా ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేయటం.. దాడి చేయటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్న. ఇదంతా చూస్తే.. మోరల్ పోలీసింగ్ మరింత పెరుగుతుందా? అన్న సందేహం తలెత్తక మానదు.
తాలిబన్లు కనుక ఏ రీతిలో అయితే ఆంక్షల కత్తిని చూసి.. పౌరులకు ఉన్న స్వేచ్ఛను హరించేస్తారో.. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొందా?అన్న అభిప్రాయం కలుగక మానదు. ఈ విషయంలో పోలీసుల వరకు వెళ్లటంతో వారు స్పందించారు. సదరు ఘటన మీద దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏమైనా ఇలాంటి పరిణామాలు చూస్తుంటే.. విలువల పేరుతో ఆంక్షల చట్రంలోకి చక్రబంధం కానున్నామా? అన్న భావన కలుగక మానదు.Full View
Full View Full View
ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీరాముడి జన్మస్థలి అయిన అయోధ్యలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అయోధ్యలో ప్రవహించే సరయూ నదిలో ఒక జంట స్నానం చేయటానికి నదిలోకి దిగింది.
ఈ సందర్భంగా ఈ జంట కాస్త సన్నిహితంగా ఉండటమే కాదు.. తన భార్యతో కాస్తంత రొమాంటిక్ అన్న చందంగా.. ముద్దు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి ఇలా చేయకూడదంటూ భార్యతో ఉన్న భర్తను పక్కకు లాగేశాడు.
దీంతో.. సదరు భర్తకు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఆ షాక్ లో ఉండగానే.. జబ్బ పట్టుకొని లాగిన వ్యక్తి భర్తను చెంప దెబ్బ కొట్టటంతో మొదలైన అరాచకం.. నదిలో వారి చుట్టూ ఉన్న వారిలో పలువురు ఆ భర్త మీద చేయి చేసుకోవటంతో ఆ భార్య బిక్కముఖం వేసిన పరిస్థితి. తన కళ్ల ముందే భర్తకు అలా జరగటాన్ని జీర్ణించుకోలేని ఆమె.. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆ భర్తకు మరిన్ని దెబ్బలు పడిన పరిస్థితి.
అయోధ్యలో ఇలాంటి పనులు సహించమంటూ ఒక వ్యక్తి వ్యాఖ్యానించటం చూస్తుంటే.. మనం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతున్నామన్న భావన కలుగక మానదు. భార్యతో భర్త సన్నిహితంగా ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేయటం.. దాడి చేయటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్న. ఇదంతా చూస్తే.. మోరల్ పోలీసింగ్ మరింత పెరుగుతుందా? అన్న సందేహం తలెత్తక మానదు.
తాలిబన్లు కనుక ఏ రీతిలో అయితే ఆంక్షల కత్తిని చూసి.. పౌరులకు ఉన్న స్వేచ్ఛను హరించేస్తారో.. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొందా?అన్న అభిప్రాయం కలుగక మానదు. ఈ విషయంలో పోలీసుల వరకు వెళ్లటంతో వారు స్పందించారు. సదరు ఘటన మీద దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏమైనా ఇలాంటి పరిణామాలు చూస్తుంటే.. విలువల పేరుతో ఆంక్షల చట్రంలోకి చక్రబంధం కానున్నామా? అన్న భావన కలుగక మానదు.