కట్టుకున్న భార్యకు హెచ్ఐవి సోకేలా చేసిన భర్త.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Update: 2022-12-16 01:30 GMT
కలికాలంలో ధర్మం కేవలం ఒక్క పాదం మీద నడుస్తుందని పురణాల్లో ఎప్పుడో చెప్పబడింది. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుత రోజుల్లో పాపాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కళ్ళ ముందే హత్యలు.. మానభంగాలు యథేశ్చగా జరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయాల్సిన పాలకులు సైతం అవినీతి రోంపులో కురవకపోవడంతో యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా కాలం గడిచిపోతుంది.

ఇక మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలిసి పోతున్నాయి. ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అయితే అందరూ ఇలా ఉన్నారని మాత్రం అనుకుంటే పొరపాటే. పైన చెప్పుకున్నట్లు ధర్మం ఒక పాదం మీద నడుస్తుందని చెప్పుకున్నట్లు నేటి రోజుల్లోనూ కొందరు మంచివాళ్లు సైతం ఉన్నారు. వీరి వల్లే ఇంకా మానవత్వం బ్రతికి ఉందని చెప్పుకోవాల్సి వస్తోంది.

తాజాగా గుంటూరులో ఒక దారుణమైన సంఘటన వెలుగు చూసింది. మరో పెళ్లి చేసుకోవాలని భావించిన ఓ వ్యక్తి తన భార్య అడ్డును తొలగించుకునేందుకు ఏకంగా అతి ప్రమాదకరమైన హెచ్ఐవి సోకేలా చేశాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న సదరు భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెల్లడి కావడంతో అంతా అవాక్కవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాడేపల్లికి చెందిన ఓ యువతిని మంగళగిరికి భార్గవ పేటకు చెందిన వ్యక్తి ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి మూడేళ్ల క్రితం ఒక కూతురు పుట్టింది. అయితే ఇటీవల ఆ మహిళకు రక్త పరీక్షలు చేయగా హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అయితే ఆమె భర్తకు మాత్రం హెచ్ఐవీ నెగిటివ్ వచ్చింది. దీంతో కంగుతున్న ఆమె తనకు భర్తతో తప్ప ఎవరితో రిలేషన్ షిప్ లేదని అలాంటప్పుడు తనకు హెచ్ఐవి ఎలా వస్తుందని వైద్యులను నిలదీసింది. ఆమె భర్త మాత్రం ఇటీవల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు హెచ్ఐవీ సోకి ఉంటుందని మాయమాటలు చెప్పాడు.

అతడి మాటను నమ్మిన ఆమె వ్యాధి విషయంలో మాత్రం ఆందోళన చెందుతూనే ఉంది. అయితే తన భర్త ఇటీవల ఓ మహిళతో సన్నిహితంగా ఉంటుండటాన్ని ఆమె గమనించింది. గతంలో తన భర్త మగ పిల్లవాడి కోసం ఇంకో పెళ్లి చేసుకుంటానని హింసించేవాడని.. ఈ క్రమంలోనే ఆ మహిళ కోసం తనకు హెచ్ఐవి సోకేలా చేశాడని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు భర్తకు ఓ మహిళతో ఇప్పటికే వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. అలాగే అతడి భార్యకు హెచ్ఐవి ఎలా ఎక్కించడనే విషయంపై ఆరా తీస్తున్నారు.

కాగా సదరు మహిళ మాత్రం తన భర్త ఆర్ఎంపీ సహాయం తనకు పలు ఇంజెక్షన్లు ఎక్కించేవాడని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సదరు ఆర్పీని సైతం పోలీసులు విచారించేందుకు రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా కట్టుకున్న భార్యకు హెచ్ఐవి సోకేలా చేసిన భర్తను మాత్రం కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News