భారత్‌ను టార్గెట్ చేస్తూ మలేషియాకు చెందిన ఓ ఉగ్రమూక భారీ విధ్వంసానికి స్కెచ్ వేసింది. ఈ ఉగ్రకుట్రకు రోహింగ్యాలకు చెందిన ఓ కీలకనేత సూత్రధారిగా వ్యవహరించినట్టు సమాచారం. అయితే ఈ ఉగ్రకుట్రను ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి.
ఈ భారీ ఆపరేషన్ కోసం సుమారు 2 లక్షల డాలర్లు కేటాయించినట్టు భారత్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొన్నది. ఆ ఉగ్రకుట్ర వెనకు రోహింగ్యాల కీలక నేత మహ్మద్ నసీర్ ఉన్నట్టు రా కనిపెట్టింది. నసీర్ కౌలాలంపూర్ కేంద్రంగా ఈ ఉగ్రకుట్రకు స్కెచ్ వేశాడని సమాచారం. మతప్రచారకుడు జకీర్ నాయక్ కూడా ఈ స్కెచ్‌లో పాలు పంచుకున్నట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన ఆధారాల కోసం వెతుకుతున్నారు. మయన్మార్‌కు చెందిన ఓ మహిళ ఉగ్రవాదులకు నాయకత్వం వహించిందట. సదరు యువతి బంగ్లాదేశ్ లేదా నేపాల్ సరిహద్దుల ద్వారా భారత్‌లోకి ప్రవేశించాలని కుట్ర చేసిందట. ఢిల్లీ, అయోధ్య, బోధ్‌గయా, పశ్చిమ బెంగాల్ లోని కీలక నగరాలు, శ్రీనగర్‌లో ఒకేసారి భారీ పేలుడుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే ఈ టెర్రరిస్టులకు చెన్నైకి చెందిన ఓ హవాలా వ్యాపారి డబ్బు సమకూర్చాడని సమాచారం. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.