ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పడు ఆసక్తికరంగా మారింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలు ఉంటాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా జాతీయజెండాతో పాటు.. కాశ్మీర్ జెండాను ఎగురువేసుకునే వీలుంది. ప్రభుత్వ భవనాలు.. ప్రభుత్వ కార్యాలయాల మీదా జాతీయ జెండాతో పాటు.. కాశ్మీర్ రాష్ట్ర జెండాను సమానహోదాలో ఎగురవేస్తుంటారు.
ఆర్టికల్ 370 ప్రకారం ఈ ప్రత్యేకత కాశ్మీర్ కు దాఖలు పర్చారు. అయితే.. ఈ అంశంపై కొందరు రాష్ట్ర హైకోర్టుకు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అంతకు ముందు కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ రాష్ట్ర పతాకానికి.. జాతీయ పతాకానికి సమాన గౌరవం ఇవ్వాలంటూ ఇచ్చిన తీర్పుపై స్టే ప్రకటించారు. రెండు జెండాలకు సమాన గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చింది. రెండింటిని సమానంగా చూడాలన్న గత నిర్ణయంపై స్టే విధించింది. ఈ నిర్ణయం వివాదాస్పదమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.