అనుకుంటాం కానీ ఎంత చెట్టుకు అంత గాలి అన్నది నిజం. స్థాయిలు ఏదైనా.. వారిని కంట్రోల్ చేసే స్థాయిలో మరొకరు ఉంటారు. అది జీవధర్మమేమో. కానీ.. ఆ చిన్న విషయాన్ని చాలామంది చాలా సందర్భాల్లో గుర్తించరు. ఎదుటివాడి నిజాయితీ అన్నది తనను కంట్రోల్ చేసే వారి మంచితనం మీద.. వారి నిజాయితీ మీద ఆధారపడి ఉంటుందన్నది మర్చిపోకూడదు.
ఎక్కడిదాకానో ఎందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విషయానికి వస్తే.. వీలున్నంతవరకూ పారదర్శకంగా వ్యవహరిస్తారని.. పక్షపాతాలు ప్రదర్శించరని చెబుతారు. కానీ.. అదెంతవరకూ అంటే.. బీజేపీ ముఖ్యనేతల ప్రయోజనాలు దెబ్బ తిన్నంత వరకూ మాత్రమే. ఈ మాట ఎంత నిజమన్నది తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్డీప్ సింగ్ సెంగార్ ఇష్యూ యోగి సర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసింది.
ఆయన విషయంలో ఇంతకాలం చూసిచూడనట్లుగా ఉపేక్షించిన సీఎం యోగి.. ప్రభుత్వ ఇమేజ్ దారుణంగా దెబ్బ తినటంతో ఆయన రియాక్ట్ కావటం షురూ చేశారు. తాజాగా సదరు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయటానికి యోగి ఓకే చెప్పేశారని.. అందుకు తగ్గ నిర్ణయం తీసుకొని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఊహించని విధంగా పార్టీ ప్రముఖుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో యోగి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
పార్టీకి చెందినప్రముఖనేత నుంచి ఫోన్ రావటంతో యోగి తన నిర్ణయాన్ని అమలు చేయకుండా ఆపారన్నారు. చట్టానికి లోబడి నడుచుకోకుంటే పాలక పార్టీ అయినా విపక్షమైనా మూల్యం చెల్లించుకోవటం తప్పదని బీజేపీ సీనియర్ నేత ఐపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి. రేప్ ఆరోపణల నేపథ్యంలో కుల్దీప్ ను అరెస్ట్ చేయటంతో పాటు.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న నిర్ణయాన్ని యోగి తీసుకున్నా.. ఒక్క ఫోన్ కాల్ ఆయన చేతుల్ని కట్టిపారేసిందని చెబుతున్నారు. పార్టీ ముఖ్యనేతల నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో యోగి వెనక్కి తగ్గినట్లుగా వార్తలు బయటకు వచ్చి.. పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.