రాజమండ్రిలో ఏ గల్లీ చూసినా అదే పోస్టర్.. అసలు కథేంటి?

Update: 2021-11-05 09:35 GMT
ఏపీలోని రాజమండ్రిలో ఇప్పుడు ‘సారీ.. మోసం చేయలేదు’ అనే పదం వైరల్ గా మారింది.ఈ పోస్టర్లు అంటించిన వీధులతో నిండిపోయింది. ఇదే ఇప్పుడక్కడ హాట్ టాపిక్ గా మారింది.రాజమండ్రిలో ఎటుచూసినా అవే పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్-దానవాయిపేట, ఏకేసీ రోడ్ పరిసర ప్రాంతాల్లో గోడలు, ఖాళీ ప్రదేశాలపై ‘సారీ.. మోసం చేయలేదు’ అని రాసి ఉన్న పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఆ పోస్టర్ లో సాడ్ సింబల్ ఏమోజీ కూడా ఉంది. వీటిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఏంటీ కథ అని ఆరాతీస్తున్నారు.

ఈ పోస్టర్ల కథ ఏంటి? ఎవరు ఎందుకు సారీ చెబుతున్నారు.? ఎవరు ఎవరిని మోసం చేశారు? అని స్థానికులు బుర్ర గీక్కుంటున్నారు. నగరంలో ఏ గల్లీ చూసినా ఇదే పోస్టర్ కనిపిస్తుండడంతో సాడ్ సింబల్ మాటున ఉన్నదెవరిని ఆరాతీస్తున్నారు. రాజమండ్రిలో ఎవరో అజ్ఞాత వ్యక్తి పెట్టిన ఈ వింత పోస్టర్స్ ఇప్పుడు హల్ చల్ చేస్తున్నారు. యువకుడు ప్రేమ విఫలం కావడంతో తాను ప్రేమించిన అమ్మాయికి క్షమాపణ చెప్పడానికి ఈ యువకుడు కొత్తదారిని ఎంచుకున్నాడని యువకులు అంటున్నారు.

ఎవరో ప్రియుడు ప్రియారాలిని మోసం చేశాడని.. లేదంటే భర్త.. భార్యను మోసం చేశాడు కావచ్చని.. లేదంటే నాయకుడు.. ఓటర్లను మోస చేశాడా? అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ప్రేమికుల మధ్య గొడవ నేపథ్యంలోనే ఎవరైనా ఇలా పోస్టర్లు అంటించి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. తన ప్రియురాలికి ఇలా ప్రియుడు వినూత్నంగా క్షమాపణ చెప్పినట్లుగా భావిస్తున్నారు.

సాధారణ సారీ చెప్పాలంటే ఏ మొబైల్ ద్వారానో.. లేక మధ్యవర్తుల ద్వారానో లేక స్వయంగా కలిసి చెప్పొచ్చు. కానీ ఈ భగ్న ప్రేమికుడు చేసిన వింత పని ఇప్పుడు వైరల్ గా మారింది.


Tags:    

Similar News