భారత శాస్త్రవేత్తల అరుదైన ఘనత.. అన్నీ వేరియంట్లకు ఒకటే

Update: 2022-02-07 10:30 GMT
రెండున్నరేళ్ల క్రితం చైనాలో పుట్టిన ఈ కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. వివిధ దేశాల్లో లక్షల సంఖ్యలో కోవిడ్ కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. కేవలం ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మంది కరోనా మహమ్మారి సోకిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య  ప్రస్తుతం తగ్గు ముఖం పట్టింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రష్యాలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే లక్ష ఎనభై వేల కేసులు వెలుగు చూశాయి. ఆ దేశం లో వైరస్ కారణంగా 661 మంది మృత్యువాత పడ్డారు.

ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా వైరస్ ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. కొత్తగా కేవలం 80 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంతేకాకుండా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య గతంతో పోలిస్తే మరింత తగ్గింది. ఈ ఒక్క రోజులోనే 895 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో రోజువారీ పాజిటివ్ రేటు 7.24 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
 
వైరస్ ఈ మూడేళ్ల కాలంలో ఒకటి తర్వాత ఒకటి అంటూ కొత్త వేరియంట్లతో దాడి చేస్తూ వస్తోంది. డెల్టా, ఒమిక్రాన్ లాంటి వేరియంట్లను ఇప్పటికే చాలా దేశాలు చూశాయి. అవి మిగిల్చిన చేదు అనుభవాలు కూడా ఇంకా ఉన్నాయి. కానీ ఒమిక్రాన్ విషయంలో డెల్టా తో పోల్చితే ఆసుపత్రి పాలైన వారు చాలా తక్కువ మంది అని చెప్పాలి. దీనికి కారణం లేకపోలేదు. డెల్టా సమయంలో కరోనా టీకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు పంపిణీ చేయకపోవడంతో చాలా మంది వైరస్ ను ఎదుర్కొనే సామర్థ్యం లేక చనిపోయారు. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలో పరిస్థితి చాలా మారింది. వ్యాధి నిరోధక శక్తి ప్రజల్లో చాలా ఎక్కువ అయ్యింది. దీంతో ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య భారీగా తగ్గింది.
 
అయితే కరోనా వైరస్ ఎలాంటి రూపాంతరం చెందిన కానీ వాటి పై పోరాడేందుకు సార్వత్రిక టీకాను అభివృద్ధి చేశారు బెంగాల్ కు చెందిన కొందరు పరిశోధకులు. ఈ పరిశోధనను బెంగాల్ లోని కాజ్రీ నజ్రుల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు, భువనేశ్వర్ లోని ఐఐఎస్ఈఆర్ శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ పరిశోధన చేపట్టారు. వీరు తయారు చేసిన ఈ టీకాకు అభిఎస్సీఓ వ్యాక్ అనే నామకరణం చేశారు. ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి ఇమ్యూనో ఇన్ఫర్మేటిక్ విధానాన్ని అనుసరించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
 
వీరు కొత్తగా  తయారు చేసిన ఈ వ్యాక్సిన్  కోవిడ్ కు సంబంధించిన సార్స్‌-కోవ్‌-2తో పాటు మరో ఇతర వైరస్ ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు  కోవిడ్ అన్నీ రకాల వేరియంట్లను ఎదుర్కొనే టీకా అందుబాటులోకి రాలేదని తెలిపారు. అభిఎస్సీఓ వ్యాక్ నే మొదటి టీకా గా పేర్కొన్నారు.  

Tags:    

Similar News