ఉత్ప‌త్తి పోరాటంః వైజాగ్ స్టీల్ చ‌రిత్ర‌లోనే అరుదైన రికార్డు!

Update: 2021-03-24 17:30 GMT
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ కార్మికులు అద్వితీయ‌మైన ఘ‌న‌త సాధించారు. క‌ర్మాగారం చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ఉత్ప‌త్తిని సాధించి రికార్డు నెల‌కొల్పారు. మార్చి 23వ తేదీన ఏకంగా 20,400 ట‌న్నుల స్టీల్ ను ఉత్ప‌త్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంత మొత్తంలో ఉత్ప‌త్తి జ‌ర‌గ‌డం ఇదే మొద‌టి సారి.

ఆల్ టైం రికార్డు ఉత్ప‌త్తిని సాధించిన కార్మికులు, ఉద్యోగులపై ప్ర‌జ‌లు, రాజకీయ పార్టీల నేత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కానీ.. ఈ ఘ‌న‌త‌ను చూసి సంతోషించా‌లో.. బాధ‌ప‌డాలో తెలియ‌ట్లేద‌ని కార్మికులు ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు.

వైజాగ్ స్టీల్ ఫ్యాక్ట‌రీని ప్రైవేటుప‌రం చేస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా కార్మికులు ఆందోళ‌న చేస్తున్నారు. మోడీ ప్ర‌భుత్వ తీరుపై నిర‌స‌న తెలుపుతూనే.. విధి నిర్వ‌హ‌ణ‌లో అద్వితీయ ఫ‌లితాల‌ను న‌మోదు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. తమ ఫ్యాక్ట‌రీని అమ్మ‌డానికి వీళ్లేద‌ని, ఇదే క‌ష్టంతో లాభాల్లోకి తెస్తామ‌ని కార్మికులు చెబుతున్నారు.
Tags:    

Similar News