సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఏం చేసినా అడిగే నాథుడే లేకుండా పోతున్నారు. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు. అసలు సెన్సార్ లేకుండా పట్టపగ్గాల్లేకుండా వీరి వ్యవహారాలు సాగుతున్నాయి. అన్నింటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా విమానంలో సిగరెట్ తాగుతూ.. రోడ్డుపై మద్యం సేవిస్తూ ఇటీవల దుమారం రేపిన ప్రముఖ యూట్యూబర్ బాబీ కటారియా అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు పోలీసులు కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్ లో రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ట్రాఫిక్ జామ్ కు కారణమైన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బాబీ కటారియాను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు.
ఈ క్రమంలోనే యూట్యూబర్ ఆచూకీ చెప్పిన వారికి రూ.25వేల రివార్డ్ అందిస్తామని పోలీసులు ప్రకటించడం విశేషం.రోడ్డుపై, విమానంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు కటారియాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. కటారియాను అరెస్ట్ చేసేందుకు హర్యానాలోని గురుగ్రామ్ లో అతడి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కానీ కటారియా పారిపోయాడు.
దీంతో యూట్యూబర్ ను పట్టుకునేందుకు పోలీసులు రూ.25వేల రివార్డ్ ప్రకటించడం గమనార్హం. డెహ్రాడూన్ ఎస్ఎస్పీ దిలీప్ సింగ్ కున్వార్, ముస్సోరీ కిమాడీ మార్గ్ లో రోడ్డు మధ్యలో టేబుల్ వేసుకొని మద్యంసేవిస్తూ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించాడని తెలిపారు. మద్యం మత్తులో బైక్ ప్రమాదకరంగా నడిపాడని తెలిపారు.
దీంతో బాబీ కటారియాపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇతగాడు దొరికితే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశాడు. కానీ మనోడు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్నాడని.. చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాని టాక్ నడుస్తోంది. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.