న‌మ్మాల్సిందే.. కోడిపుంజు గుడ్డు పెట్టింది

Update: 2018-04-21 05:09 GMT
కోడి గుడ్డు పెడుతుంది. మ‌రి.. కోడి పుంజు? స‌మ‌స్యే లేదు. గుడ్డు ఎలా పెడుతుంద‌ని ప్ర‌శ్నిస్తారు ఎవ‌రైనా. ఇక‌పై పుంజు గుడ్డు పెట్ట‌ద‌ని చెప్పేయ‌టానికి వీల్లేదు. ఎందుకంటే తాజాగా ఒక కోడి పుంజు గుడ్డు పెట్టేసిన వైనం సంచ‌ల‌నంగా మారింది.

ఈ విచిత్ర‌మైన ఉదంతం తెలంగాణ రాష్ట్రంలోని ఖ‌మ్మం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన ర‌ఘునాథ‌పాలెం మండ‌లంలోని వి.వెంక‌టాయ‌పాలెం గ్రామానికి చెందిన ఒక వ్య‌క్తి ఇంట్లోని పుంజు గుడ్డు పెట్టేసింది. ఆల‌స్యం శ్రీ‌నివాస‌రావు అనే పెద్ద‌మ‌నిషి ద‌గ్గ‌ర ఉన్న కోడి పుంజు పెట్టిన గుడ్డు ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. గ‌తంలోనూ ఒక తోలు గుడ్డు పెట్టింద‌ని.. నిజ‌మా కాదా?  అన్న సందేహం ఉంద‌ని.. తాజాగా పెట్టిన గుడ్డుతో అది నిజ‌మ‌ని తేలిపోయిన‌ట్లుగా చెప్పారు.

గ‌త నెల‌లో పుంజు పెట్టిన గుడ్డు నిజ‌మా?   కాదా? అన్న‌ది తేల్చేందుకు ఈ పుంజును విడిగా ఉంచిన‌ట్లుగా స‌ద‌రు వ్య‌క్తి చెప్పారు. ఇదిలా ఉంటే.. పుంజు గుడ్డు పెట్ట‌టం సాధ్య‌మేనా? అన్న ప్ర‌శ్న‌కు స్థానికంగా ఉండే ప‌శువైద్యాధికారి డాక్ట‌ర్ కిషోర్ స్పందిస్తూ.. కోడి పుంజు పెట్టే గుడ్డును విండ్ గుడ్డుగా పిలుస్తార‌ని.. మొద‌టిసారి పెంకు లేకుండా.. త‌ర్వాత పెంకుతో గుడ్డు పెట్ట‌టం అప్పుడ‌ప్పుడు జ‌రుగుతాయ‌న్నారు. అయితే.. ఇలాంటి గుడ్డులో ప‌చ్చ‌సొన ఉండ‌ద‌ని.. పున‌రుత్ప‌త్తికి ఈ గుడ్లు ప‌నికి రావ‌న్నారు. ఏతావాతా తేలేదేమంటే.. పుంజు కూడా గుడ్డు పెడుతుందని.
Tags:    

Similar News