సముద్రంలో చిక్కుకున్న ఓడ.. న్యూ ఇయర్ ప్లాన్స్ రివర్స్..!

Update: 2023-01-03 00:30 GMT
మనం ఒకటి తలిస్తే.. దేవుడు మరొకటి తలచాడనే సామెతను వినే ఉండి ఉంటారు. ఈ సామెత అచ్చంగా ఈ కింది వారి విషయంలో అతికినట్టు సరిపోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. 2022 కు గుడ్ బై చెప్పి 2023 కు ఘనంగా స్వాగతం పలకాలని ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేసుకున్నారు.

ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఘనంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ముందస్తుగానే ఒక ఓడలో అక్కడికి బయలుదేరి వెళ్లారు. న్యూజిలాండ్  నుంచి బయలుదేరిన ఓ క్రూజ్ షిప్ జనవరి 1 లోగా ఆస్ట్రేలియాకు చేరాల్సి ఉంది. ఈ షిప్ లోనూ ఎక్కువ మంది ఆస్ట్రేలియాకు చెందిన వారే ఉన్నారు. వీరంతా న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు.

అయితే వారం రోజులుగా ఆ క్రూజ్ షిప్ ఎక్కడా ఆగకుండా సముద్రంలో నిలిపి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. జనవరి 1న ఆస్ట్రేలియాకు చేరుకోవాల్సిన ఈ ఓడను అక్కడి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ముందుకు వెళ్లేలేకపోయింది. ఈ ఓడ హాల్ కింది భాగంలో ఫంగస్ బాగా పేరుకుపోయింది. బ్యాక్టిరియా.. సూక్ష్మజీవుల మొక్కలు వంటి బయోఫౌల్ పెరిగిందని సమాచారం.

ఇది తమ జలాల్లోకి ప్రవేశిస్తే హానికరం అని భావించిన ఆస్ట్రేలియా అధికారులు ఓడను లంగర్లు వేసేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఓడ నిర్వాహకులు గజ ఈతగాళ్లను పెట్టి ఫంగస్ ను తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓడ ముందుకు కదిలింది. దీని కారణంగా జనవరి 1న ఆస్ట్రేలియాకు చేరాల్సిన క్రూజ్ షిప్ ఒక్కరోజు ఆలస్యంగా జనవరి 2న చేరుకుంది.

దీంతో ప్రయాణికుల న్యూ ఇయర్ ప్లాన్స్ రివర్స్ కావడంతో ప్రయాణీకులు ఓడ నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో షిప్ నిర్వాహకులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఆగ్రహాన్ని తగ్గించేందుకు పరిహారంగా టికెట్ రుసుములో కొంత నగదును వెనక్కి ఇస్తామని ప్రకటించడంతో పాటు క్షమాపణలు కోరింది. దీంతో ప్రయాణీకులు చేసేది ఏమి లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News