28 ఏళ్ల మోడ‌ల్ ని పెళ్లాడుతున్న 40 ఏళ్ల గాయ‌ని

Update: 2022-05-10 04:30 GMT
హాలీవుడ్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ పాప్ గాయ‌ని 40 ఏజ్ లో 28ఏళ్ల మోడ‌ల్ తో ప్రేమాయ‌ణం సాగించ‌డం ఇప్పుడు అది పెళ్లికి దారి తీయ‌డం హాట్ టాపిక్ గా మారింది. బ్రిట్నీ ఎట్ట‌కేల‌కు పెళ్లాడుతోంది. త‌న‌ కాబోయే భర్త సామ్ అస్గారితో  వివాహ తేదీ లాక్ చేసారు. బ్రిట్నీ స్పియర్స్ కాబోయే భర్త ఏం చేస్తారు? అంటే.. ఫిట్ నెస్ నిపుణుడిగా మారిన నటుడిగా అత‌డు ప‌రిశ్ర‌మ‌కు సుప‌రిచితం. వధువుతో క‌లిసి అత‌డు పెళ్లి తేదీని నిర్ణయించుకున్నట్లు ఆదివారం తన ఇన్ స్టా స్టోరీస్ ద్వారా ప్రకటించారు.

సెప్టెంబరు 2021లో ఈ జంట మొదటిసారి నిశ్చితార్థం చేసుకున్నప్పటి నుండి ''మా జీవితాలు నిజ జీవితంలో ఒక‌ అద్భుత కథ'' అని అతను ఒక ఫోటోపై రాశాడు. త్వరలో రాణి కాబోతున్న మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.. అని బ్రిట్నీకి విష్ చేసాడు.  బిగ్ డే తేదీ నిర్ణయ‌మైంది. క‌చ్చితమైన తేదీ గోప్యంగా ఉంచబడుతుందని.. పెళ్లి తర్వాతి రోజు వరకు ఎవరికీ తెలియదు అని రాశారు.

పేజ్ సిక్స్ మ్యాగజైన్ నోట్స్ ప్రకారం.. 13 సంవత్సరాల పాటు టాక్సిక్ గాయని బ్రిట్నీ ఆర్థిక వ్య‌వ‌హారాల ప‌రంగా ఆమె జీవితంలోని ఇతర అంశాలను నియంత్రించిన కోర్టు తాజా ఆదేశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. కోర్టు ఆదేశించిన కన్జర్వేటర్ షిప్ ను న్యాయమూర్తి రద్దు చేసిన ఆరు నెలల తర్వాత ఈ పెళ్లి ప్రకటన వచ్చింది. బ్రిట్నీ స్పియర్స్ శనివారం తన వివాహానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా వెల్లడించింది.

ఆమె తన పెంపుడు జంతువు ఫోటోని షేర్ చేసి ఒక ఎగ్జ‌యిట్ మెంట్ సింబ‌ల్ తో తన కుటుంబానికి అరుదైన సంద‌ర్భ‌మిద‌ని వెల్ల‌డించారు. ''వెండీని పరిచయం చేస్తున్నాను !!! ఇది MEOW సమయం అబ్బాయిలు .. అమ్మాయిలు. అవును.. ఇది నా పెళ్లి దుస్తులకు ముసుగు !!!'' అని బ్రిట్నీ స్పియ‌ర్స్ పోయెటిక్ గా వ్యాఖ్య‌ను రాసారు.

అస్గారీ నేప‌థ్యం ఏమిటీ? అన్న‌ది వెతికితే అత‌డు ఒక సాధార‌ణ ట్ర‌క్ డ్రైవ‌ర్ కొడుకు. అయితే మోడ‌లింగ్ లో రాణించాడు. లాస్ ఏంజెల్స్ లో నివాసం ఉంటున్నాడు. బ్రిట్నీతో ప‌రిచ‌యం ప్రేమ నిశ్చితార్థం అనంత‌రం పెళ్లి ఇవ‌న్నీ క‌ల‌లా సాగిపోతున్నాయి. స్లంబ‌ర్ పార్టీ అనే వీడియో సాంగ్ కోసం బ్రిట్నీ అత‌డిని టీమ్ లో చేర్చుకుంది. అనంత‌రం ఇక తెలిసిన క‌థే మిగిలిన‌ది అంతా.

బ్రిట్నీకి ప్ర‌పంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. త‌న పెళ్లి గురించి తెలిసిన అనంత‌రం సోష‌ల్ మీడియాలో వేడెక్కించే కామెంట్లు పోటెత్తాయి. పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ పెళ్లి తేదీ ఫిక్స్ అని ఒక అభిమాని వ్యాఖ్యానించ‌గా.. లేటు వ‌య‌సు గాయ‌ని పెళ్లికి భాజా ఫిక్స్ మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. 28 ఏళ్ల నటుడితో 40 ఏళ్ల గాయ‌ని పెళ్లి బావుంది అంటూ ఒక ఫ్యాన్ వ్యాఖ్యానించ‌గా.. ఈ పెళ్లి కూడా అర్జున్ - మ‌లైకా పెళ్లిలానే! అంటూ వేరొక అభిమాని కామెంట్ చేసారు.
Tags:    

Similar News