అమెరికాలో గురువారం విడుదలైన కొత్త స్టేట్ పోల్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దారుణంగా ఓడిపోతాడని.. కనీసం డిపాజిట్ కూడా దక్కదని ఆ సర్వేలో తేలింది. ఈ ఫలితాలు అధ్యక్షుడు ట్రంప్ కు మింగుడు పడడం లేదు.
ప్రముఖ అమెరికన్ పత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’- సియానా కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ కి 333 సీట్లు వస్తాయని తేలింది. అదే సమయంలో ట్రంప్‌కు కేవలం 205 మాత్రమే రావడం విశేషం. అధ్యక్షుడు బరాక్ ఒబామా తన 2012 రెండోసారి ఎన్నికలలో గెలిచిన దానికంటే పెద్ద గెలుపును జోబిడెన్ సొంతం చేసుకుంటాడని.. ట్రంప్ దారుణంగా ఓడిపోతున్నాడని తేలింది.
ఇక ఒహియోలో క్విన్నిపియాక్ విశ్వవిద్యాలయం బుధవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన పోల్ ను బుధవారం విడుదల చేసింది, బిడెన్ 46% ట్రంప్ 45% గా ఓట్లు వచ్చాయి. జూన్ ఆరంభంలో విడుదల చేసిన ఫాక్స్ న్యూస్ పోల్‌లో బిడెన్ 47% ట్రంప్ 45% గా ఉంది.
నవంబర్ 3 న డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ 330 ఎన్నికల ఓట్లను సాధించటానికి చాలా విశ్వసనీయమైన అవకాశం ఉందని తాజా పోల్స్ తెలిపాయి. ఇది అమెరికా రాజకీయాల్లో దుమారం రేపింది. సిట్టింగ్ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా ఈ ఫలితాలు వచ్చాయి. ట్రంప్ విదేశీ వలసలు నిషేధించినా కూడా ఈ ఫలితాలు రావడం రిపబ్లికన్ పార్టీని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఫలితాల్లో ట్రంప్ కు డిపాజిట్స్ కూడా రావని పేర్కొనడం ఆయనకు షాకింగ్ గా మారింది. ఇప్పుడు ట్రంప్‌కు ఉన్న ఏకైక ఆశ భారీగా అమెరికన్లను ఆకట్టుకోవడమే.. ఎన్నికలు మరో 132 రోజుల్లోనే ఉన్నాయి. రాబోయే ఐదు నెలల్లో పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్ ఆశించాలి.ట్రంప్ సరిదిద్దుకోలేకపోతే ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.