కొందరికీ అదృష్టం భలేగా కలిసివస్తుంటుంది. లక్కీ డ్రా వంటి వాటిల్లో నామమాత్రంగా ఖర్చు చేస్తే లక్ కలిసి వస్తుండటం మనకు తెలుసు. కానీ మధ్యప్రదేశ్ లోని షాజపూర్ కు చెందిన విజయ్ కి అలాంటిదేమీ లేకుండా ఏకంగా లక్ష రూపాయల బంపర్ ఆఫర్ వచ్చింది. భోపాల్ లోని లాల్ ఘాటిలో గల హౌసింగ్ బోర్డులో స్వీపర్ గా పనిచేస్తున్న విజయ్ ని లక్షరూపాయల ధనవంతుడిగా మార్చింది కేవలం రెండు వేల నోటు!
ఇంతకీ ఏం జరిగింది అంటే జీతం డబ్బులు తీసుకునేందు ఏటీఎంకు వెళ్లిన విజయ్ డబ్బులు డ్రా చేసుకున్నాడు. కొత్తగా మెరిసిపోతున్న రూ.2000 నోటును అలా చూస్తుండుపోయాడు. అయితే పనిలో మాత్రం స్వీపర్ అయినప్పటికీ ఆయన బుర్ర అద్భుతంగా పనిచేసింది. నోటు చివర్లో 786 అనే నెంబర్ ను అతడు గమనించారు. దీంతో అతని ఆనందానికి పట్టపగ్గాలు లేకుండాపోయాయి. ఎందుకంటే ముస్లింలు పవిత్రంగా భావించే నెంబర్ అది. దీంతో ఇంతటి ప్రత్యేకత గల నెంబర్ నోటును అమ్ముకొని డబ్బులు సంపాదించుకుందామని ప్లాన్ వేసి ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజమైన ఈబే ను సంప్రదించాడు. తన ఫోన్ లో వాట్సాప్ ద్వారా ఆ నోటును ఫొటో దింపి ఈబేకు పంపించాడు. విజయ్ స్కెచ్ వర్కవుట్ అయింది. భోపాల్ కు పొరుగున ఉన్న ఇండోర్ కు చెందిన ఓ వ్యక్తి ఆ ప్రత్యేక నెంబర్ నోటుపై తెగ ముచ్చటపడిపోయి లక్ష రూపాయలు ఇచ్చి తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. అంతేకాదు వెంటనే లక్ష రూపాయల చెక్ కూడా పంపాడు. ఇలా బుర్రకు పదునుపెట్టడం వల్ల స్వీపర్ కాస్త లక్షాధికారి అయిపోయాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/