నిత్య పెళ్లికొడుకు అరెస్ట్: 13 మందిని వాడుకొని మోసం..

Update: 2022-07-21 11:30 GMT
విడాకులు తీసుకున్న మహిళలు.. చాలా కాలం నుంచి పెళ్లికాని యువతులను.. టార్గెట్ చేసిన ఓ యువకుడు నిత్య పెళ్లికొడుకుగా మారాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటూ మోసం చేస్తూ వచ్చాడు. పెళ్లి చేసుకోవడమే కాకుండా శారీరకంగా, ఆర్థికంగా మోసం చేస్తూ పరారయ్యాడు.

అయితే ఇలా మోసపోయిన బాధితుల్లో ఓ మహిళ పోలీసులకు ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మరికొంత మంది బాధితులు వెలుగులోకి వచ్చారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం  13 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది.

హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో శివశంకర్ బాబు (33) పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన శివశంకర్ మ్యాట్రిమోనీని టార్గెట్ చేశాడు. ఇందులో యువతుల బయోడెటాను సేకరిస్తాడు. ఆ తరువాత వారిని తాను పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు. మాయమాటలు చెప్పి వారిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరవాత ఏదో కారణం చెప్పి డబ్బులు అడుగుతాడు. ఆ తరువాత కనిపించకుండా మాయమై పోతాడు. ఆ తరువాత ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ అయింది.

ఇలా హైదరాబాద్ కు చెందిన ఓ యువతికి ఇలాగే మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తనకు అమెరికాలో ఉద్యోగం వచ్చిందని చెప్పి డబ్బు కావాలని వేధించేవాడు. ఆయన బాధ చూడలేక ఆ మహిళ రూ.32 లక్షలు అప్పజెప్పింది.

అయితే ఆ డబ్బును తీసుకున్న శివకుమార్ మళ్లీ కనిపించలేదు. ఆ తరువాత ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ గా ఉంది. అయితే మొదట్లో తీవ్రంగా మనోవేదనకు గురైనా ఆ యువతి ఆ తరువాత అతని గురించి ఆరా తీసింది. దీంతో అతడు అప్పటికే చాలా పెళ్లిళ్లు చేసుకున్నట్లు బయటపడింది. దీంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తానికి శివశంకర్ బాబను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ నిత్య పెళ్లి కొడుకు శివశంకర్ ను పోలీసులు అరెస్టు చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. అతను ఇప్పటికే 12 మందిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అయితే చాలా మంది పరువు పోతుందనే భయంతో బయటికి రావడం లేదని అన్నారు. డబ్బుల కోసమే మహిళలను ట్రాప్ చేసి మోసం చేశాడని తెలిపింది. మ్యాట్రిమోని ద్వారా తాను పరిచయం చేసుకొని అమాయకంగా ప్రవర్తిస్తాడని పేర్కొంది.
Tags:    

Similar News