కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులు ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఆన్ లైన్ లో ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలు క్లాసులు చెప్తున్నాయి. అయితే , ఇలా ఆన్ లైన్ లో క్లాసులు చెప్తున్న ఓ టీచర్ క్లాసులు చెప్తూ మధ్యలో జాతీయగీతాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదేంటి జాతీయ గీతం నేర్పడం ఏమంత నేరం కాదు కదా అని అనుకుంటున్నారా ? జాతీయగీతం నేర్పడం తప్పదు కాదు కానీ , ఆ టీచర్ నేర్పేది భారతదేశం యొక్క జాతీయగీతం కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయగీతం. కిండర్ గార్డెన్ పిల్లలకు జార్ఖండ్ లోని ఓ ప్రైవేటు స్కూల్ ఈ ఘటన జరిగింది.
ఈ వ్యవహారం ఇప్పుడు బయటకి రావడం తో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ టీచర్ జాతి వ్యతిరేకి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తూర్పు సింఘ్ భూమ్ జిల్లా జంషెడ్ పూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వెలుగుచూసిన ఈ ఉదంతంపై జిల్లా విద్యాశాఖ యంత్రాంగం విచారణ చేపట్టింది. ఎల్ కేజీ, యూకేజీ పిల్లలకు ఆన్ లైన్ లో పాఠాలు చెప్తున్న ఓ టీచర్ బంగ్లా, పాక్ జాతీయ గీతాలు నేర్చుకోవాలని చెప్పింది. వాటికి సంబంధిచిన యూట్యూబ్ లింకులను వారికి షేర్ చేసింది.
దాయాది దేశాల జాతీయ గీతాలు నేర్చుకోవడమేంటని తొలుత పిల్లల తల్లిదండ్రులు తికమకపడ్డారు. కొందరు ఇదేంటని అభ్యంతరం చెప్పారు. ఇక, ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర నేత కునాల్ సారంగి ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్ యాంటి నేషనల్ గా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీ వేశామని జిల్లా విద్యాధికారి శివేంద్ర కుమార్ చెప్పారు.