తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ అమ్మాయిని చంపేసిన టెక్కీకి త్రిశూర్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఇంజనీరింగ్ చదివిన ఓ అమ్మాయిని ప్రేమించాలంటూ కల్లూరులోని కొట్టాయంలో టెక్కీగా పనిచేస్తున్న నిధీష్ వేధిస్తున్నాడు. అయితే ఇతనితో ప్రేమ, పెళ్ళి లాంటివి ఏవీ ఇష్టం లేదని ఆ అమ్మాయి చెబుతునే ఉంది. ఏదో రకంగా ఆమెను వేధిస్తున్న యువకుడిని తప్పించుకుని చాలాకాలం ఆ అమ్మాయి తిరుగుతోంది. అయితే చివరకు విసిగిపోయిన నిధీష్ సదరు యువతిని గట్టిగా వార్నింగ్ ఇవ్వటం మొదలుపెట్టాడు.
ఒకరోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన టెక్కీ తనను వివాహం చేసుకోవాలంటూ గట్టిగా బెదిరించాడు. అయినా సరే ఆ అమ్మాయి ఎదురుతిరిగింది. తనకు మంచి ఉద్యోగం చేయాలని ఉందని ఎంత చెప్పినా యువకుడు వినిపించుకోలేదు. చివరకు తన వెంట పెట్రోలు డబ్బా, యాసిడ్ బాటిల్, కత్తిని వెంట తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మళ్ళీ బెదిరించాడు.
చంపేస్తానని బెదిరించినా ఆ అమ్మాయి లొంగకపోవటంతో తనను కాదన్న అమ్మాయి మరెవరిని వివాహం చేసుకునేందుకు లేదంటూ ఆ అమ్మాయిపై పెట్రోలు పోసేశాడు. అయితే దాన్ని తప్పించుకున్న ఆ అమ్మాయి ఇంట్లోని బాత్ రూంలోకి పారిపోయింది. అయితే ఆ యువతిని బాత్ రూం వరకు వెంటాడిని నిధీష్ చివరకు బాత్ రూం లోకి కూడా దూరం ఆమెపై పెట్రోలు పోసి తగలబెట్టేశాడు. పైగా ఆ అమ్మాయి బయటకు రాకుండా తలుపుకు గడియ కూడా పెట్టేశాడు. ఇంట్లో నుండి మంటలు రావటాన్ని గమనించిన పొరుగు వాళ్ళు కొందరు ఇంట్లోకి వచ్చారు. దాంతో తాన వద్ద ఉన్న విషయం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే నిధీష్ ను పట్టుకుని స్ధానికులు చావగొట్టి పోలీసులకు అప్పగించారు. చివరకు కేసును విచారించిన కోర్టు అందుబాటులో ఉన్న సాక్ష్యల ఆధారంగా నిధీష్ కు యావజ్జీవ శిక్షతో పాటు మరో రూ. 5 లక్షల జరిమానాను విధించింది.