కరోనా కారణంగా ప్రపంచం ఇప్పుడు కొత్త సమస్యల్ని ఎన్నింటినో ఎదుర్కొంటోంది. ఏళ్లకు ఏళ్లుగా అలవాటైన జీవన విధానం మొదలు.. ఇప్పటివరకూ ఎప్పుడూ ఎదురుకాని ఇబ్బందులు.. సామాజిక ఆంక్షలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పరిధులు.. పరిమితులు వచ్చేశాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పటికి కుదుటపడతాయన్నదానిపైనా క్లారిటీ రాని పరిస్థితి. రోజులు గడిచే కొద్దీ సమస్య తీవ్రత పెరగటమే కానీ తగ్గేట్లుగా కనిపించట్లేదు.
దేశాల ఆర్థికస్థితి ఒక్కసారి తలకిందులు కావటమే కాదు.. కుదుటపడే పరిస్థితి కనుచూపు మేర లేనట్లుగా తయారవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వ్యక్తిగత సంబంధాలు.. అనుబంధాలు.. భావోద్వేగాలు ఇలా అన్ని కూడా కరోనా కారణంగా ప్రభావితమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యవసర రంగాలు తప్పించి.. మిగిలిన రంగాల వారు ఇంటికే పరిమితమవుతున్నారు. అతి ముఖ్యమైన అవసరాలకు తప్పించి.. విడిగా వారు బయటకు రావాల్సిన అవసరమే లేకుండా పోతోంది.
ఇలాంటివేళ.. అపాయం పొంచి ఉన్నా.. ప్రాణాల్ని పణంగా పెట్టి పని చేస్తున్న వారిలో తొలి స్థానం వైద్యులు.. వైద్య సిబ్బందికేనని చెప్పాలి. అందునా.. కరోనా వార్డుల్లో పని చేసే వారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. మిగిలిన వారంతా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటే.. వైద్యులు మాత్రం కుటుంబ సభ్యుల దగ్గరకు కూడా వెళ్లలేకపోతున్నారు. తాజాగా సౌదీకి చెందిన కరోనా వైద్యుడు ఒకరు తన విధులు నిర్వర్తించి మెడికల్ సూట్ లోనే ఇంటికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే.. ఆయన చిన్ని కుమారుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. మామూలుగా అయితే.. వెంటనే అతన్ని పట్టుకొని.. హత్తుకొని ముద్దులు పెట్టుకునేవాడేమో. కానీ.. కరోనా వేళ.. అలా చేయలేక తన కొడుకును తన వద్దకు రావొద్దని హెచ్చరించాడు. దీంతో.. అది అర్థం చేసుకోలేని చిన్ని మనసుతో ఏమైందా? అన్నట్లు ఆగిపోయాడు. అతగాడి పరిస్థితి చూసి ఆ తండ్రి వేదనతో కింద కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఆరంటే ఆరు సెకన్ల ఈ వీడియో చూసినంతనే పలువురిని తీవ్ర భావోద్వేగానికి గురి చేయటమే కాదు..కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ చిన్ని వీడియోలోని భావోద్వేగం ఇట్టే కనెక్ట్ చేయటమే కాదు.. అయ్యో వైద్యులకు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో కదా? అన్న భావన కలగక మానదు. ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారటమే కాదు.. ఎమోషన్ కు గురి చేస్తున్న ఈ వీడియో వైద్యుల కష్టాల్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుందని చెప్పాలి.