హైదరాబాద్ మహానగరంలోని ఆర్టీసీ సిటీ బస్సులో ఎక్కిన ఒక హైదరాబాద్ మహిళ వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారటమే కాదు.. స్థానికంగా సంచలనంగా మారింది. సిటీ బస్సు ఎక్కిన ఆమె.. అనూహ్యంగా తన బట్టల్ని విప్పేస్తూ.. తోటి ప్రయాణికులపై చేయి చేసుకోవటమే కాదు.. తన చేతిలో ఉన్న బిడ్డను సైతం బయటకు విసిరేసిన అమానుష ఉదంతం చోటు చేసుకుంది. ఈ విచిత్రమైన ఉదంతం శుక్రవారం చోటు చేసుకుంది.
37 ఏళ్ల వయసున్న వివాహిత ఒకరు తన మూడేళ్ల కుమార్తెతో కలిసి ఇంటికి వెళ్లేందుకు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అఫ్జల్ గంజ్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఎక్కారు. ఎంజీబీఎస్ దగ్గర బస్సులో ఎక్కిన ఆమె ఎల్ బీ నగర్ కు టికెట్ తీసుకున్నారు. బస్సుఎక్కిన కాసేపటికే తోటి ప్రయాణికులపై దాడి చేయటం మొదలు పెట్టింది.
బట్టలు విప్పేస్తూ తోటి ప్రయాణికులు గందరగోళానికి గరయ్యేలా వ్యవహరించింది. ఆమెను వారించే ప్రయత్నం చేసిన కండెక్టర్ పైన చేయి చేసుకుంది. అంతేకాదు.. తన చేతిలో ఉన్న మూడేళ్ల కుమార్తెను బస్సు కిటికీలో నుంచి బయట పడేసే ప్రయత్నం చేసింది.
దీంతో బస్సులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆమె చేస్తున్న గొడవకు మలక్ పేట పోలీస్ స్టేషన్ ఎదుట బస్సును ఆపాడు డ్రైవర్. అదే సమయంలో చేతిలో ఉన్న పాపను బయటకు విసిరేయటం.. లక్కీగా ఆ పాపకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు.
అదే సమయంలో.. బస్సు దిగి టైరు దగ్గర కూర్చొని.. బస్సు ముందుకు కదలిస్తే తాను చచ్చిపోతానంటూ బెదిరించింది. ఆర్టీసీ డ్రైవర్.. కండెక్టర్ కలుగజేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు రంగంలోకి దిగి.. ఆమెను పక్కకు తీశారు.
ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రయత్నం చేశారు. ఏమైనా.. ఆమె చేసిన రగడ బస్సు ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళనకు గురి చేసిందని చెప్పక తప్పదు.