లెబనాన్ రాజధాని బీరూట్ లో మంగళవారం సంభవించిన భారీ పేలుళ్లు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన లో మృతుల సంఖ్య 78కి చేరింది. దాదాపు 4వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ నగరంలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు కనపడుతున్నాయి. ఈ భారీ పేలుడు ధాటికి సంబంధించిన శబ్దాలు 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వివినిపించినట్టు తెలుస్తోంది. బీరూట్ నగరంలో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. పరిసరాల ప్రాంతాల భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనాస్థలి నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర భవనాలన్నీ ధ్వంసమయ్యాయి. పేలుళ్ల ధాటికి భూమి కంపించిందని, దాని తీవ్రత 3.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పోర్టులో నిల్వ చేసిన పేలుడు పదార్థాల వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా గత ఏడాది కాలంగా లెబనాన్‌లో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి నెలకొంది. పేదరికం తారస్థాయికి చేరింది. నిత్యావసరాల కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటువంటి సమయంలో రాజధానిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో వారి జీవితాల్లో మరింత చీకటి నిండుకుంది. ప్రజల జీవితాలను మరింత గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టింది.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. లెబనాన్ కు తమ దేశం తోడుగా ఉంటుందని, ఆ దేశానికి ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ఘటన భయంకరమైన దాడిలా కనిపిస్తోందని ఆయన తెలిపారు. ఇది పేలుడు పదార్థాల తయారీ వల్ల సంభవించలేదని, బాంబు దాడి అని భావిస్తున్నట్లు ఆయన అన్నారు. అయితే పోర్ట్‌సైడ్ గిడ్డంగిలో కొన్నేళ్లుగా నిల్వ ఉంచిన 2,750 టన్నుల వ్యవసాయ ఎరువు అమ్మోనియం నైట్రేట్ కారణంగా పేలుడు సంభవంచి ఉంటుందని ప్రధాని హసన్ డియాబ్ అన్నారు. ఇలా నిల్వ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదంటూ లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ ట్వీట్ చేశారు.
ఇక ఈ ఘటనపై సామాజిక కార్యకర్త మయా అమ్మర్ మాట్లాడుతూ.. ‘‘అందరి అరుపులు, కేకలతో ఈ ప్రాంతం దద్దరిల్లిపోయింది. భారీ ప్రమాదం ఇది. బీరూట్ పోర్టు మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికీ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బీరూట్ ను ఇంతకు ముందెన్నడూ ఇలా చూడలేదు. అంతా నాశనం అయిపోయింది. ఇంకేమీ మిగల్లేదు. నన్ను ఇంటికి తిరిగి రావాల్సిందిగా కుటుంబ సభ్యులు, స్నేహితులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఎంతో మంది ఇళ్లు పోగొట్టుకుని నిరాశ్రయులయ్యారు. వారికి సాయం చేసేందుకు వెళ్తున్నా. మా గుండెల్లోని బాధను నేడు బీరూట్ ప్రతిబింబిస్తోంది’’అని అయన ఆవేదన చెందారు.
దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక మహిళ తన యజమాని బిడ్డను కాపాడేందుకు చేసిన సాహసం విశేషంగా నిలిచింది. పేలుడు సమయంలో ఆ ఇంటి పనిమనిషి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను కాపాడిన వీడియో చూస్తే.. ఒక్క క్షణం నిశ్చేష్టులవడం ఖాయం.