ఎంబీఏ చేశానని చెప్పాడు. చాలా వ్యాపారులున్నాయని చెప్పి పెళ్లి సమయంలో 50 తులాల బంగారం, నగదు, కారు పొందాడు. స్నేహితుల భార్యలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళతో విదేశీ టూర్లకు తిరిగి చివరికి ఉన్నదంతా ఊడ్చేశాడో ప్రబుద్ధుడు. అప్పులొల్ల బాధ ఎక్కువడంతో ఇంటికెళ్లి రూ.20 లక్షలు అదనంగా కట్నం తేవాలని..లేకపోతే పడక సుఖం పంచి అప్పులు తీర్చాలని భార్యను వేధిస్తున్న ఓ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఎంబీఏ చేశానని, బిజినెస్ ఉందని చెప్పి 2002లో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో 50 తులాల బంగారం, నగదు, కారు పొందాడు.
పెళ్ళైన ఆరు నెలల వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత అతడు మద్యానికి బానిసయ్యాడు. 2005లో ఆ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. ఆ సమయంలోనే అతడు అహ్మదాబాద్ లో ఓ ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాడు. అప్పటి నుంచి అతడు పబ్ లకు వెళ్లడం, జూదం ఆడటం, స్నేహితుల భార్యలతో అక్రమ సంబంధాలు నెరపడం ప్రారంభించాడు. 2019లో స్నేహితుల భార్యలతో విదేశీ టూర్లకు వెళ్లి జల్సాలు చేశాడు. ఇలా వచ్చిన ఆదాయం అంతా ఖర్చు పెట్టడం, ఆ తర్వాత కరోనా కష్టాలు తోడు కావడంతో అప్పుల్లో కూరుకు పోయాడు. అప్పులిచ్చిన వారు తీర్చాలని ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. అప్పు కట్టలేనని కావాలంటే తన భార్య అందంగా ఉంటుందని ఆమెతో గడపాలని చెప్పాడు. అందుకు వారు అంగీకరించారు. దీంతో అతడు రోజు మద్యం తాగి ఇంటికెళ్లి రూ. 20 లక్షలు కట్నం తెస్తావా.. అప్పులోళ్లకు పడక సుఖం ఇస్తావా.. అని భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఇంత నీచానికి దిగజారిన భర్తను ఎగలేక పోయిన ఆమె తాను కట్నంగా తెచ్చిన 50 తులాల బంగారం ఇస్తే పుట్టింటికి వెళ్లి పోతానని చెప్పడంతో ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె అహ్మదాబాద్ వెస్ట్ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి కిరాతక భర్తను విచారించేందుకు సిద్ధమవుతున్నారు.