కోడలి కర్కశం : భర్త, అత్త, మామలను కుర్చీలకు కట్టేసి కాల్చి చంపింది..

Update: 2020-11-14 15:00 GMT
సమాజంలో రోజురోజుకూ దారుణాలు పెరుగుతున్నాయి. ఓ దుర్మార్గురాలు తన భర్తతోపాటు, అత్తమామలను ఒకే రోజు దారుణంగా హత్య చేసింది. ప్రజలంతా దీపావళి పండగ హడావిడిలో ఉండగా ఈమె మాత్రం ప్రొఫెషనల్​గా మర్డర్​ చేసేసింది. ఇంట్లోని కుర్చీలకు కట్టేసి మరి వారిని హతమార్చింది. ప్రియుడితో కలిసి ఈ మర్డర్​ చేసింది. చివరకు పోలీసులకు పట్టుబడింది. ఈ కిలాడి కిల్లర్​ను పట్టుకొనేందుకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు.. రాజస్థాన్ కు చెందిన దలీల్ చంద్ (74), ఆయన భార్య పుష్పాబాయ్ (70) దంపతులు 40 ఏళ్ల క్రితమే చెన్నైలో స్థిరపడ్డారు.

ఎలిఫెంట్ గేట్ సమీపంలోని వినాయక మిస్రీ స్ట్రీట్ లోని ఆపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. వీరికి నగరంలో ఫైనాన్స్​ వ్యాపారాలు ఉన్నాయి. ఈ దంపతులకు సీతల్ (40) కుమారుడు, కుమార్తె పింక్ (36) ఉన్నారు. సీతల్ కు మహారాష్ట్రలోని పూణేకి చెందిన జయమాల (36) తో 14 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి 13 ఏళ్లు, 11 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండేళ్లుగా జయమాల, సీతల్​కు పడటం లేదు. జయమాల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. మరోవైపు జయమాల పూణే పోలీస్ స్టేషన్ లో అత్తమామలు, భర్తపై ఫిర్యాదు చేసింది. భర్త తన కోరికలు తీర్చడం లేదని ఆమె ఫిర్యాదు చేయడం గమనార్హం. విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. పుట్టింటిలో ఉంటున్నది.

తాను తన పిల్లలు బతకడానికి రూ. 5 కోట్లు భరణం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. అయితే ఈ విషయంపై ఇరు కుటుంబాలకు గొడవ నడుస్తున్నది. రెండు నెలల క్రితం జయమాల, తన ప్రియుడు, కొంతమంది గ్యాంగ్​తో చెన్నై కి వెళ్లి సీతల్ కుటుంబసభ్యులను బెదిరించారు. దీనిపై సీతల్ చెన్నైలోని ఎలిఫెంట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. కోడలు జయమాలతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద కేసు నమోదైయ్యింది. గురువారం రాత్రి జయమాల కొంతమందితో కలిసి తన అత్తమామ ఉంటున్న ఇంటికి వెళ్లి వాళ్లను కుర్చీలకు కట్టేసి రివాల్వర్​తో కాల్చిచంపింది. గురువారం రాత్రి సీతల్​ సోదరి పింక్​ అపార్ట్ మెంట్ లోకి వెళ్లగా ఆమె తండ్రి దలీల్ చంద్, తల్లి పుష్పాబాయ్, సోదరుడు సీతల్ రక్తపు మడుగులో కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది.

దలీల్ చంద్ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కోడలు జయమాల, అతని బాబాయ్, మామ, మరో ముగ్గురు యువకులు కలిసి ఇంటికి వచ్చారని గుర్తించారు. జయమాల తరువాత తన వెంట వచ్చిన వారి సహాయంతో భర్త సీతల్, మామ దలీల్ చంద్, అత్త పుష్పాబాయ్ ను కుర్చీలకు కట్టేసి రివాల్వర్ తీసుకుని వారి నుదిటి మీద కాల్చి చంపేసిన విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను పుణేలో అరెస్ట్​ చేశారు. జయమాలను అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
Tags:    

Similar News