ఈ మధ్య కాలంలో కాలంలో ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి , వాటిని ఓ వ్యసనంగా మార్చుకొని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న మొన్నటి వరకు పబ్జి ఆన్లైన్ గేమ్ కు బానిసై ఎంతోమంది యువకులు, స్కూల్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ రమ్మీ, స్నూకర్, వంటి గేముల్లో డబ్బులు పెట్టి అప్పుల పాలు అయ్యి , ఆ అప్పుల భాద తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అయితే , ఇటీవలే పబ్జి ను కేంద్రం బ్యాన్ చేయడంతో , పబ్జి మరణాలు తగ్గుతుంటే , ఆన్లైన్ రమ్మీ లో పెట్టుబడి పెట్టి మరణించేవారి సంఖ్య తగ్గిపోతుంది.
తాజాగా చెన్నై లో ని సెంబియం పరిసరాల్లో ఓ 28ఏళ్ల వ్యక్తి ఆన్లైన్ రమ్మీ కి బానిసై , అప్పులు చేసి ఆ భాదతో ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఇప్పుడు చాలామంది వద్ద స్మార్ట్ ఫోన్స్ ఉండటంతో కాలక్షేపం కోసం ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు విల్లుపురం జిల్లాకు చెందిన ఎం కుమారసన్ కూడా అదే మాయదారి గేమ్‌కు బానిస అయ్యాడు. ఒక ప్రైవేట్ బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆన్ లైన్ రమ్మీకి బానిసైన కుమారసన్ అప్పులు బాధ తట్టుకోలేక తీవ్ర మనోవేధనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అతనిని రూమ్మేట్స్ ఉరివేసుకున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న సెంబియం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుమారసన్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు అతన్ని చనిపోయినట్లు వెల్లడించారు.
ఆన్ లైన్ లో రమ్మీ ఆడటానికి బానిసై తండ్రి వద్ద కూడా ఇటీవల రూ. లక్ష వరకు అప్పుగా తీసుకున్నాడు. నెలకు రూ .18,000 సంపాదిస్తున్నట్లు చెప్పిన కుమారసన్.. కుటుంబానికి మాత్రం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కాలక్షేపం కోసం ఆడుదామని బానిసలైపోతున్న యువకులు, సాప్ట్‌వేర్ ఉద్యోగులు ఎందరో.. ఫలితంగా లక్షలాది రూపాయలు పోగొట్టుకోవడమే కాక ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఈ కారణం చేతనే తెలుగు రాష్ట్రాల్లో దీనిపై నిషేధం నడుస్తుంది. ఆన్ లైన్ రమ్మీ వల్ల ఆర్థికంగా నష్టపోవడమేకాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.