వీడు క‌దా.. అస‌లు సిస‌లు కామాంధుడంటే!!

Update: 2022-12-28 03:30 GMT
కామాంధుడు.. అని త‌ర‌చుగా మీడియా పేర్కొంటుంటుంది. కామంతో క‌ళ్లు మూసుకుపోయి.. మ‌హిళ‌ల‌పై అత్యాచారాల‌కు పాల్ప‌డేవాడ‌ని కదా.. అర్ధం. అయితే.. ఈ అర్ధాన్ని ఇప్పుడు తిరిగి రాసుకునే ప‌రిస్థితి వ‌చ్చేసింది. నెటిజ‌న్లు.. ఇదే వ్యాఖ్య చేస్తున్నారు. `వీడు క‌దా.. అస‌లు సిస‌లు కామాంధుడు` అని కామెంట్లు చేస్తున్నారు. ఇంత‌కీ.. వాడెవ‌రు..? ఏం చేశాడు?  చూద్దాం ప‌దండి!

కన్నతల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆ తర్వాత చంపేస్తానని బెదిరించాడు. ఉత్తరాఖండ్లో ఈ ఘటన జరిగింది.  ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో తల్లీకొడుకుల బంధానికి మచ్చతెచ్చే ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు.. కన్నతల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పౌరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన పంకజ్ అనే యువకుడు గతకొద్ది రోజులుగా  అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

డిసెంబరు 25 సాయంత్రం కుమారుడికి ఆహారం పెట్టేందుకు తల్లి వెళ్లింది. ఆ సమయంలో తల్లిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రంగా దాడి చేసి చంపేస్తానని కూడా బెదిరించాడు.

అడ్డు వచ్చిన తండ్రిని కూడా కొట్టాడు. ఈ మొత్తం విషయాన్ని బాధితురాలు.. తన కుమార్తెకు చెప్పింది. వెంటనే తల్లీకూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పౌరీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని ఖండూసైన్‌ జిల్లా జైలుకు తరలించారు. ఈ విష‌యం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. దీంతో నెటిజ‌న్లు.. వీడు క‌దా.. కామాంధుడు అని మండిప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News