హోటల్ లో నాపై అత్యాచారం చేసిందంటూ మహిళపై యువతి కేసు

Update: 2021-03-04 02:30 GMT
గోవాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ‘నాపై ఓ మహిళ అత్యాచారం చేసిందని.. దాదాపు నాలుగు గంటల పాటు నన్ను చిత్రహింసలకు గురిచేసిందని.. మత్తుమందు ఇచ్చి మరీ నాపై అఘాయిత్యం చేసింది’ అంటూ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే యువతిపై ఫిర్యాదు చేసింది పురుషుడు కాదు.. ఓ స్త్రీ కావడం విశేషం. పోలీసులు ఈ కేసులో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.

మగాడు ఓ స్త్రీపై అత్యాచారం చేస్తే రేప్ కేసు పెట్టొచ్చు..   ఓ మహిళే ఒక మగాడిని అత్యాచారం చేసినా రేప్ కేసు పెట్టొచ్చు. కానీ మహిళపై మహిళ రేప్ చేయడం.. పురుషుడు.. పురుషుడిపై రేప్ చేయడం చట్టాల ప్రకారం కుదరదు అని తేల్చారట..  అయితే ఈ కేసును లైంగిక వేధింపుల కేసుల జాబితాలో చేర్చి కేసు నమోదు చేశారట..ఢిల్లీకి చెందిన ఓ యువతి గే , బైసెక్సువల్ సమస్యలపై పోరాడుతుంటుంది. ఈమెకు కొంత కాలం క్రితం ఫ్రాన్స్ దేశానికి చెందిన 26 ఏళ్ల యువతి ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. ఆమె కూడా ఇదే  సమస్యలపై పోరాడుతుంది.

ఫిబ్రవరి 23న ఆ ఢిల్లీ మహిళ గోవా వెళ్లింది. అదే సమయంలో ఫ్రెంచ్ యువతి కూడా అక్కడే ఉన్నట్టు తెలిసింది. ఇద్దరూ కలవాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీ మహిళ చెప్పిన హోటల్ కు ఫ్రెంచ్ యువతి వెళ్లింది. తన వద్ద ఉన్న సమస్యకు పరిష్కారం చూపించే మాత్రలు ఉన్నాయంటూ ఓ టాబ్లెట్ ను ఫ్రెంచ్ యువతికి ఆ ఢిల్లీ మహిళ ఇచ్చింది.

మాత్రలు వేసుకున్న ఫ్రెంచ్ యువతి మత్తులోకి జారుకుంది. మత్తులో ఉన్న ఆమెపై ఢిల్లీ మహిళ లైంగిక వేధింపులకు పాల్పడింది. అత్యాచారం కూడా చేసింది.దాదాపు 4 గంటల పాటు అత్యాచారం చేసింది. మరుసటి రోజు గోవా పోలీసులకు ఫ్రెంచ్ యువతి ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 25న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉంది.
Tags:    

Similar News