విమానం ఎక్కాలంటే ఆధార్ ఉండాల్సిందే

Update: 2017-04-05 12:08 GMT
స‌ర్వం ఆధార్ మ‌యం అన్న‌ట్లుగా మారిన ప‌రిస్థితుల్లో కొత్త రూల్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్పటికే ఇన్‌కంటాక్స్‌ రిటర్న్స్‌, పాన్‌ నెంబర్‌ తీసుకోవడం వంటి వాటికి ఆధార్‌ను అనుసంధానం చేసిన కేంద్రం ప్రస్తుతం విమాన ప్రయాణానికి కూడా ఆధార్‌ను అనుసంధానం చేయాలని భావిస్తోంది. అంతేకాకుండా సిమ్‌ కార్డులు తీసుకోవడానికి కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయనున్నారు. విమాన ప్రయాణానికి ఆధార్‌తో లింకు పెట్టాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలన్నింటిలోనూ ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విప్రో సంస్థను కేంద్ర ప్రభుత్వం కోరింది.

ఇదిలాఉండగా...ఆధార్‌ వ్యవస్థలో సమాచారం బహిర్గతం కావడానికి ఎలాంటి ఆస్కారం లేదని కేంద్ర సహాయ మంత్రి పిపి చౌదరి చెప్పారు. ధోని విషయంలో ఆధార్‌ ఏజెంటుతో కలిసి ధోని తన ఆధార్‌ స్లిప్‌ ను పట్టుకుని ఫొటో దిగారని, ఆ ఫొటోను పత్రికలకు విడుదల చేశారని ఆయన అన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గతం చేయకూడదని ఆదేశాలిచ్చామని ఆయన అన్నారు. ఈ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందని, బయోమెట్రిక్‌ వివరాలు కాని, ఇతర సమాచారం కాని వెల్లడయ్యే అవకాశాలు లేవని ఆయన అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News