ఆధార్. ఈ మూడక్షరాలూ సగటు భారతీయుడి వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ప్రతి చిన్న పనికీ ఇదే ఆధారమా అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఆధార్ లేకపోతే అసలు భారతీయుడన్న గుర్తింపేలేదన్నట్టుగా ప్రభుత్వాలు ప్రచారం చేయడంతో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులు తీయించుకున్నారు.
అయితే ఈ రూల్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు మరోలా ఉంది. అన్నింటికీ ఆధార్ కార్డ్ అనవసరమని స్పష్టంచేసింది. ప్రజాపంపిణీ, గ్యాస్ రాయితీలకే ఆధార్ అవసరమని తేల్చిచెప్పింది. అంతేకాదు ఆధార్ లో పేర్కొన్న వ్యక్తిగత సమాచారం కూడా ఎవరికీ ఇవ్వాల్సిన పని లేదని పేర్కొంది. అన్నింటికీ ఆధార్ తప్పని కాదని మీడియా ద్వారా ప్రచారం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
సుప్రీం మాటల్ని కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందో లేదో..? స్వచ్ఛ్ భారత్ తరహాలో పీఎం మోడీ ఈ అంశంపై మీడియాలో ప్రచారం చేయిస్తేనే ఫలితం లేదంటే.. సామాన్యులకు ఇబ్బందులు తప్పవు గాక తప్పవు.