ఆధార్ ను నిర్వహిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వ్యాపార సంస్థలు - ప్రభుత్వ సంస్థలకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి వినియోగదారుల గుర్తింపు కోసం ఆధార్ ను ధృవీకరణ కోసం తీసుకుంటే రూ.20 రూపాయలు చెల్లించేలా నిబంధనలు మార్చింది. అంతేకాదు.. ప్రతీ లావాదేవీ ఆధార్ ధృవీకరణ కోసం రూ.0.50పైసలు చెల్లించాలని గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
వినియోగదారుల ఆధార్ వివరాలను ఇష్టం వచ్చినట్లు తమ వ్యాపార అవకాశాలకు వాడుతున్న వ్యాపార సంస్థలకు ముకుతాడు వేయడానికే ఆధార్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ వాడాలంటే ఇక నుంచి రూ.20 రూపాయలు చెల్లించేలా కఠిన నిబంధనలు పొందుపర్చింది.
ఆధార్ వివరాలు అధికారికంగా పరిశీలించి ఆన్ లైన్ లో వినియోగదారుడి కేవైసీ వివరాలు తెలుసుకోవాలంటే ప్రతీ లావాదేవీకి ఇక నుంచి వ్యాపార - ప్రభుత్వ సంస్థలు రూ.20 చొప్పున చెల్లించాలని నిబంధన పెట్టింది. ఆ వివరాలు ధృవీకరణ కోసం మరో రూ.0.50 పైసలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆధార్ ధరల ధ్రువీకరణ సేవల నియంత్రణ-2019 పేరిట ఆధార్ సంస్థ అత్యవసర ఆదేశం జారీ చేసింది. అయితే దీనికింద ప్రభుత్వ సంస్థలు - పోస్టల్ శాఖను మినహాయించారు. మిగిలిన అన్ని ప్రభుత్వ - ప్రైవేటు సంస్థలు ఇక ఆధార్ ప్రామానిక సేవలు పొందుతున్నందుకు లావాదేవీల రుసుములు చెల్లించాల్సిందే..