ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశువులకు కూడా గుర్తింపు ఇవ్వాలని అనుకుంటుంది. అందుకే ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే పశువులకు కేంద్రం సహాయంతో ఆధార్ గుర్తింపు ఇవ్వనుంది. ఇందులో భాగంగా పశువులకు ఆధార్ ఈ ట్యాగ్ వేయనున్నారు. దీని ద్వారా యజమానులు తమ పశువులతో దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు - అలాగే ఆన్ లైన్ లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. ఇక పశువులు అపహరణకు గురైన ఈ ట్యాగ్ ద్వారా అవి ఎక్కడో ఉన్నాయో కనుకోవచ్చు.
ఇదేగాక పశువుల ఆధార్ నెంబర్ ని ఈనాఫ్ యాప్ తో ఆధార్ నెంబర్ అనుసంధానం చేయడం ద్వారా, ప్రభుత్వం పాడిపశువులకు ప్రత్యేక ఆరోగ్య సదుపాయం కల్పిస్తుంది. ట్యాగ్ కు ఉన్న కోడ్ ను ఆధారంగా పశువు గురించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా.. పశువులు ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయి..? వాటికి ఎద ఇంజక్షన్లు ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు దూడను ఈనుతుంది? లాంటి ఆరోగ్య విషయాలు చాలా సులువుగా తెలుసుకోవచ్చు.
అలాగే పశువులకు ఏం జబ్బులు ఉన్నాయి. వాటికి ఏం మందులు వాడాలనే అంశాలు యాప్ లో నమోదు చేస్తారు. ఇన్ని లాభాలు ఉండటం వల్ల ఏపీ ప్రభుత్వం దీన్ని అమలు చేసే దిశగా వెళుతుంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కూడా. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను ఆదుకునేందుకు కొత్తగా వైయస్సార్ పశు నష్టపరిహారం పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ప్రకారం పాలిచ్చే పశువులు గానీ, గొర్రెలు - మేకలు - పొట్టేళ్లు గానీ చనిపోతే రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలోకి నష్టపరిహారం ఈ పథకం ద్వారా అందుతుంది.