సర్వం ఆధార్ మయం చేసేస్తున్న నిబంధనలు ఒకవైపు...ససేమిరా ఆధార్ వాడాల్సిన అవసరం లేదనే సర్వోన్నత న్యాయస్థానం భావనలు మరోవైపు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆధార్ విషయంలో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ సేవలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి చేసిన తీరుపైనే పలువురికి అభ్యంతరాలు ఉండగా...తాజాగా మరో ఆశ్చర్యకరమైన వార్త తెరమీదకు వచ్చింది అదే పబ్ ల్లోకి వెళ్లే వారికి ఆధార్ తప్పనిసరి చేయడం.
హైదరాబాద్ పబ్స్ లో డ్రగ్ కల్చర్ విస్తృతంగా ఉన్నది ఎంత నిజమో...అదుపు తప్పుతున్నదనేది కూడా అంతే నిజం. ఇటీవల డ్రగ్స్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ సిటీ పబ్‌లపై నిఘా పెట్టింది. పబ్ అడ్డాగా కొకైన్ - ఎల్ ఎస్ డీల వినియోగం ఎక్కువగా పెరిగినట్లు పోలీసులు తేల్చారు. ఇటీవల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్ రాకెట్ ద్వారా ఈ విషయం బయటపడింది. అయితే పబ్ ఎంట్రీపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. పబ్ కు వెళ్లే వాళ్లు ఇక నుంచి కచ్చితంగా తమ ఆధార్ కార్డులను చూపించాలి. ఈ నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ తేల్చిచెప్పింది.
వాస్తవానికి ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉంటేనే పబ్‌లోకి ఎంట్రీ కల్పిస్తారు. కానీ ఇక నుంచి ఆధార్ తప్పనిసరి. 21 ఏళ్లు దాటినవాళ్లు మాత్రమే పబ్ లోకి ఎంటర్ కావాలి. అయితే ఇన్నాళ్లు ఏదో ఒకటి చెపితే సరిపోయేది కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ తప్పకుండా తీసుకువెళ్లాలి. ఆధార్ వల్ల అండర్ ఏజ్ వ్యక్తులను గుర్తించవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఐడెంటీ కార్డు అనేది కొత్త రూల్ కాదు అని - ఆధార్ కార్డు తప్పనిసరి అన్నదే కొత్త విషయమని ఎక్సైజ్ సూపరిండెంట్ - సిట్ చీఫ్ శ్రీ శ్రీనివాస్ రావు తెలిపారు.