వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మామూలోడు కాదన్న సంగతి తెలిసిందే. అయితే... ఆయన మరీ ఇంత స్పీడన్న సంగతి మాత్రం ఆయన చెబితేనే తెలిసింది. ఆయన మాటలు విన్న తరువాత చాలా మంది టీడీపీ నేతలు పార్టీకి మరో జేసీ దివాకరరెడ్డి దొరికారని అని సరదాగా అంటున్నారు.
మొఖం మీద కొట్టినట్లుగా మాట్లాడి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి సంగతి తెలిసిందే. అయితే... తాజాగా టీడీపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి కూడా అదే టైపులో మాట్టాడుతున్నారు. టీడీపీలో చేరిన తరువాత జమ్మలమడుగులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన ఆయన అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్పారు. రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని… అయితే వారు ఇబ్బంది పెడితే అంతకు రెండింతలు ఇబ్బంది పెడతానని ఆయన హెచ్చరించారు. బద్వేల్ లో జయరాములు( వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే) రాజకీయంగా వీక్ గా ఉన్నారని అక్కడికి వెళ్లాల్సిందిగా తనకు సీఎం సూచించారన్నారు. తాను మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు.
ఇక తన పాత పార్టీ వైసీపీలో ముచ్చట్ల గురించి మొదలు పెట్టిన ఆయన... జగన్ కు ఇద్దరూ ఆడపిల్లలే ఉన్నారని కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుని వీరభోగవసంతరాయుడి లాంటి కొడుకును కనాల్సిందిగా తాను సూచించానని చెప్పారు. అలాగే... చంద్రబాబుకు కులపిచ్చి ఉందని... అది మార్చుకోవాలని ఆయనకు చెప్పానని అన్నారు. వైఎస్ హయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా జరిగాయని.. అంతకంటే వేగంగా చేయాలని చంద్రబాబుకు సూచించానన్నారు. కాగా జగన్ ను రెండో పెళ్లి చేసుకోమని సూచించాననడం ఇప్పుడు రాయలసీమ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి టీడీపీలోకి వచ్చిన స్టార్టింగులోనే ఆయన చంద్రబాబుకు ఇన్ని సలహాలు ఇస్తున్నారంటే రానురాను చంద్రబాబుకు చుక్కలు చూపించడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.